నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు
- పకడ్బందీగా ఉత్సవ ఏర్పాట్లు
కోటబొమ్మాళి, ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, భక్తులు కోరిన కొర్కెలు తీర్చే కల్పవల్లిగా స్థానికంగా కొలువైయున్న కొత్తమ్మతల్లి 101 వ వార్షిక జాతర ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులు పాటు జరిగే ఈ జాతర ఉత్సవాలు గురువారం నాటితో ముగియనున్నాయి. ఈ ఉత్సవాలు ప్రతీ ఏటా మహాలయ అమావాస్య మరుసటి గురువారం నాడు అసలు సిసలైన పండుగ జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తారు. శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణావతారం ధరించే ముందు దేవకీ వాసుదేవులకు అష్టమ గర్బమందు జన్మించిన శ్రీకృష్ణభగవానుని ప్రత్యామ్నాయంగా ఉంచిన యోగమాయే కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి అని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ ఉత్సవాలకు ఈ ప్రాంత ప్రజలే కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు మ్రొక్కుబడులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు. ఈ యేడాది ఈ ఉత్సవాలు రాష్ట్ర స్ధాయి ఉత్సవాలుగా ప్రభుత్వం ప్రకటించటంతో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ , ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డితో పాటు అన్ని శాఖల అధికారులు స్థానిక దేశం నేతలు తదితరుల పర్యవేక్షణలో గ్రామపెద్దలు సూచనలు, సహాయసహకారాలతో నిర్వహిస్తున్నారు. మూడు
రోజలు పాటు నిర్వహించే కొత్తమ్మతల్లి ఉత్సవాలు రాష్ట్ర స్థాయి ఉత్సవాలుగా నిర్వహించాలని ప్రభుత్వం అదేశించటమంతో ఈ యేడాది భారీ ఏర్పాట్లు చేసారు. కొత్తపేట నుండి మూడు కిలోమీటర్లు పోడవునా కోటబొమ్మాళి కాంప్లెక్స్ వరకు విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేసారు. లైటింగ్‌తో కూడిన వెంకటేశ్వర ఆలయం, కొత్తమ్మతల్లి ఆలయం వంటి భారీ కటౌట్లు చూపర్లును ఆకట్టుకోనే విదంగా ఏర్పాట చేసారు. అలాగే దర్శనానికి విచ్చేసిన భక్తులకు దేవస్దానం వారు ఉచిత ప్రసాదాలను పంపిణీకి ఏర్పాట్లు, దర్శినానికి వచ్చే భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు : ఈ సందర్బంగా ఉత్తరాంద్ర జిల్లాల్లోనే ప్రావీణ్యం పోందిన కబాడీ, సంగిడీ రాళ్లు, ఈడ్పురాయి, ఉలవల బస్తాలు పోటీలు సోమ మంగళ, బుధవారాల్లో జరుగుతాయి. అలాగే పగటి వేషాలు, కొయి డ్యాన్సులు తో పాటు మూడు రాత్రులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక బస్సులు, వైద్య శిబిరాలు: జిల్లా నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్దం ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపుతుంది. అలాగే వైద్యశాఖ వారు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసారు.
ఎగ్జిబిషన్ ఏర్పాటు: ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జైంట్‌వీల్, కొలంబో, బ్రేక్ డ్యాన్స్, టోరాటోరా, మోటార్ సైకిల్, కారు విన్యాసాలు వంటివి ఎంతగానో ఆకట్టుకుంటుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.
పోలీస్ బారీ బందోబస్తు: ఈ మూడు రోజులు పాటు నిర్వహిస్తున్న జాతర ఉత్సవాలులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఆద్వర్యంలో సుమారు 800 పోలీసులతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్దానిక ఎస్ఐ సత్యన్నారాయణ తెలిపారు. ఏవరైనా ఎటువంటి ఆసాంఘిక చర్యలకు పాల్పడినా 9440795835, 08942238633 నెంబర్లుకు పోన్ చేయాలని ఎస్.ఐ సూచించారు.
ఉత్సవ ఏర్పాట్లును పరిశీలించిన జిల్లా ఎస్పీ:
కొత్తమ్మతల్లి ఉత్సవ ఏర్పాట్లును జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా క్యూలైన్లు, ఆలయ ప్రాంగణం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కంట్రోల్ రూంలు, డ్రోన్ కెమెరాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన తోపాటు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వి. సత్యన్నారాయణలు ఉన్నారు.