BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

*అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం.

Select Suryaa Now
*అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం.


పేదలకు భక్తులకు స్వయంగా వడ్డించిన చింతకాయల పద్మావతి*
నర్సీపట్నం అక్టోబర్ 12 మేజర్ న్యూస్ :
​అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో స్థానిక మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో చింతకాయల పద్మావతి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పేదలకు, భక్తులకు తన చేతుల మీదుగా స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం పద్మావతి  మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి కనీసం ఒక పూట అయినా కడుపు నింపాలన్న సత్సంకల్పంతో అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
​కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ, తుఫానులు విరుచుకుపడిన సమయాల్లోనూ ఏ ఒక్క సోమవారం కూడా ఆటంకం లేకుండా ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగడం గొప్ప విషయమని ఆమె కొనియాడారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా కోటి ప్లేట్లకు పైగా అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఇంతటి బృహత్తరమైన అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అలాగే భక్తులంతా విచ్చేసి అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి  పిలుపునిచ్చారు.