BREAKING
జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు! మాంచెస్టర్ సినగాగ్ దాడి ఘటనపై బ్రిటన్ బహిరంగ విచారణ ప్రముఖుల భద్రతపై బ్రిటన్ సమీక్ష...మాజీ మంత్రి హత్య నేపథ్యంలో కీలక నిర్ణయం ఆర్‌బీఎల్ బ్యాంక్ క్యూ2 లాభాల్లో భారీ జంప్: 170 శాతం వృద్ధితో రూ. 482 కోట్లకు చేరిన నికర లాభం.. మెరుగుపడిన ఆస్తి నాణ్యత! తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియామకం యూరోపియన్ యూనియన్‌కు 5,841 టన్నుల చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతి: టీఆర్‌క్యూ కింద రాయితీ సుంకంతో ఎగుమతులు! 28 రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న యూట్యూబర్ నందన.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ వైరల్!

కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు

Select Suryaa Now
కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు


కోటబొమ్మాళి, అక్టోబరు 12, మేజర్ న్యూస్: కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజులు పాటు జరగనున్న బాలికలు, పురుషులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు.  స్థానిక జిల్లా పరిషత్ బాలుర ప్రభుత్వ పాఠశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఈ పోటీలను ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. తొలుత బాలికల కబడ్డీ పోటీలలో కర్నూలు, కృష్ణా జిల్లాల జట్ల మధ్య అలాగే కడప, శ్రీకాకుళం జట్ల మధ్య పురుషులు కబడ్డీ పోటీలు ఉల్లాసంగా జరిగాయి. రాష్ట్ర స్థాయిలో 12 జిల్లాల బాలిక కబడ్డీ జట్లు, 21 పురుషుల జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులకు గెలుపు ఓటమిలను సమానంగా తీసుకుని క్రీడా స్పూర్తిని, స్నేహభావాన్ని ప్రదర్శించాలని మంత్రి క్రీడాకారులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో దేశం నేతలు కింజరాపు హరివరప్రసాద్, బోయిన రమేష్, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి, క్రీడాభిమానులు ఉన్నారు.

సీతన్నపేట గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు:
కోటబొమ్మాళి మేజరు పంచాయతీ సీతన్నపేట గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతానని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన సోమవారం సాయంత్రం రూ. 1.50 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. త్రాగునీటికోసం గ్రామస్థులం తీవ్ర ఇబ్బందులు పడుత న్నామని మంత్రి అచ్చెన్నాయుడు తీసుకురాగా త్వరలో ఇంటింటికి కొళాయిల ద్వారా త్రాగునీరు అందించటం జరుగుతుందని, అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.