కార్యకర్తలే పార్టీకి బలం
అరకులోయ, అక్టోబర్ 12, మేజర్ న్యూస్: మండలంలోని పెదలబుడు గ్రామ రచ్చబండ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు,బూత్ కమిటీల బలోపేతం,ఐడి కార్డుల పంపిణీ పై సోమవారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం. చాణక్య హాజరై కార్యకర్తలకు ఐడి కార్డులు అందజేశారు.ఈ సందర్భంగా రేగం.చాణక్య మాట్లాడుతూ
పార్టీ సంస్థాగత నిర్మాణంలో కార్యకర్తలే కీలకమన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుకు మోసం చేయడం కొత్తేమీ కాదని,మీ పంచాయతీని దత్తత తీసుకున్నానని చెప్పి కనీస సౌకర్యాలైన ఇంటింటికి కొళాయి,సిసి రోడ్డు, పంచాయతీకీ ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించకపోవడం చాలా బాధాకరమన్నారు.ఎన్నికల ముందు అనేక సంక్షేమ పథకాలపై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఈ మోసపూరిత కూటమి ప్రభుత్వాన్ని నమ్మవద్దని ఆయన చెప్పారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.ఎన్నికల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకే టికెట్లు కేటాయిస్తామని,మీరు కోరుకున్న వ్యక్తికే అరకులోయ ఎమ్మెల్యే రేగం. మత్స్యలింగం బీ-ఫారం అందజేస్తారని స్పష్టం చేశారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. జగనన్న భరోసాతో పార్టీ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా, ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి అదనంగా 5.50 లక్షలు, మొత్తం 7.50 లక్షల బీమా సౌకర్యం ఈ నెల 1వ తేదీ నుండే అమలులోకి వచ్చిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎస్టి సెల్ మాజీ అధ్యక్షులు కమ్మిడి. అశోక్, మండల వైసీపీ అధ్యక్షులు స్వాభి. రామ్మూర్తి,యువజన విభాగం అధ్యక్షుడు బోయి. కిరణ్ కుమార్,మండల ఉపాధ్యక్షుడు పల్టసింగి. విజయ్ కుమార్,ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు పాంగి. నగేష్ ,మండల బూత్ కమిటీ ఇంచార్జి కొర్రా. అర్జున్,డివిజన్ ప్రధాన కార్యదర్శి మండ్య కేడ్డి బాలరాజు,మాజీ వైస్ ఎంపీపీ రామన్న,మాజీ ఎంపీటీసీ రాంచందర్, సూపర్ మాజీ ఎంపీటీసీ నొబ్బో,పంచాయతీ అధ్యక్షుడు భారికి.ఆనంద్ మాజీ సర్పంచ్ సన్యాసి, పార్టీ ముఖ్య నాయకులు బోయి మహా దేవ్, శుక్రయ్య,రామారావు, మురళి,కోటేశ్వరరావు ప్రసాద్,మోహన్ రావు బుజ్జిబాబు, ధర్మానాయుడు, శంకరరావు,సుబ్బారావు రామానాయుడు,దేవ్ దాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.