నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం
నెక్కొండ, మేజర్ న్యూస్, నెక్కొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో, నెక్కొండ తండాలోని ఆంజనేయస్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయంలో కొలువుదీరిన దేవతామూర్తులకు విశేష పూజలు నిర్వహించే ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బివిఎన్ శాస్త్రి, వేద జ్యోతిష పండితులు బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ శాస్త్రి, అనుముల గోపాలకృష్ణమూర్తి శర్మ, ఆలయ కమిటీ డైరెక్టర్లు గుంటుపల్లి ప్రభాకర్ రావు, కొత్త కొండ గణేష్ , ఉత్సవ కమిటీ బాధ్యులు మార్త రాజు, కరంబోతు గోపీనాథ్, మార్త మధుసూదన్ , పొక్కుల ధనిష్ట,కిషన్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గోమాతలకి ప్రార్థన చేసి గణపతి పూజతో వేడుకలు ప్రారంభించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం ఆలయంలోని వేడుకల మంటపంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని ,పంచలోహ మూర్తిని ప్రతిష్టించి శ్రీ సూక్త విధానంలో అర్చించారు. నవగ్రహ అష్టదిక్పాలక పంచలోకపాలక పూజ చేశారు. సర్వతోభద్ర మండలoలో అమ్మవారిని నెలకొల్పి పూజలు చేశారు. భక్తులు కుంకుమ పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామలింగేశ్వర సేవాసమితి సభ్యులు , వాసవి మహిళా మండలి, కిట్టి పార్టీ సభ్యులు పాల్గొన్నారు. భవాని మాలదారులు రాఘవేంద్ర, ఆదిత్య, భరత్ సాయి, శ్రీకాంత్,వంశీ,రిషి,హృతిక్ రోషన్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహాన్ని మాదరపు రిషి కుమార్ బహుకరించారు. నెక్కొండ తండాలో... నెక్కొండ తండాలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే మంట పనులు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సర్పంచు బానోతు రవికుమార్, మాలదారులు శ్రీకాంత్ రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మహిళా భవాని మాలదారులు కూడా కుంకుమ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు.
రిపోర్టర్: శ్రవణ్ శాస్త్రి, నెక్కొండ, వరంగల్ జిల్లా