పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ
నర్సీపట్నం .గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి రేవతమ్మ , గొలుగొండ ఎస్సై పి. రామారావు పాల్గొని గ్రామ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో శాంతిభద్రతలను కాపాడాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు.అలాగే మహిళలపై జరిగే అత్యాచారాలు, ఇతర నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.పోలీసలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాకలపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.