BREAKING
నేటి రాశి ఫలాలు – 12 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 12 అక్టోబర్ 2026, సోమవారం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్

పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం

Select Suryaa Now
పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం

 

కోటబొమ్మాళి,పాడి రైతుల ఆదాయం పెంపు మరియు పశువులకు సంవత్సరం పొడవునా జీవనోపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా పశుగ్రాస సాగు పథకాన్ని అమలు చేస్తోంది. దీనికై పాడి రైతుల నుండి పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం పలుకుతుందని మండల పశువైద్యాధికారి డాక్టర్ లఖినేని కిరణ్ కుమార్ అన్నారు.
పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  ఆయన కోరారు. శనివారం స్థానిక విలేకర్లుతో మాట్లాడుతూ పాడి రైతులకు ఈ పథకం కింద పశుగ్రాసం సాగు చేసే రైతులకు ఎకరానికి రెండేళ్ళకు మొత్తం రూ. 69,781లు ప్రభుత్వం అందిస్తుదని, ఇందులో మొదటి సంవత్సరం రూ.43,573, రెండువ సం వత్సరం రూ.26వేలు అందజేయటం జరుగుతుందన్నారు. అయితే రెండు పశువులు ఉన్న రైలు 25 సెంట్లులో, 3 నుంచి 5 పశువులకు 50 సెంట్లు, ఐదు కంటే ఎక్కువ పశువులకు ఎకరం వరకు మంజూరు చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పథకం కింద హైబ్రిడ్ నేపియర్, కో -3, కో -4, గినియా గడ్డి మొదలగు పశుగ్రాస రకాలను సాగు చేయవచ్చు. ఇవి ఒకసారి నాటితే 3 నుండి 5 సంవత్సరాల పాటు దిగుబడినిస్తాయి. ఈ పథకానికి జాబ్ కార్డు కలిగిన ఎస్సీ, ఎస్టీ, చిన్న మరియు సన్నకారు రైతులు అర్హులు. అంతేకాకుండా లబ్ధిదారుని సొంత అర్హత గల భూమిలోనే సాగు చేయాలి. గ్రామసభ ఆమోదం తప్పనిసరి. పశు సంవర్ధక శాఖ సహకారంతో ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఎకరాలలో పశుగ్రాస సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యం కాగా, జిల్లాకు 3840 ఎకరాలు లక్ష్యం కేటాయించబడి, ఒక్కో మండలమునకు 128 ఎకరాలుగా లక్ష్యంగా నిర్దేశించబడింది. కావున ఆసక్తి గల పాడి రైతులు మరిన్ని వివరాలకు తమ దగ్గరలోని గ్రామీణ జీవనోపాధి మిషన్ కార్యాలయాన్ని గానీ, రైతు సేవా కేంద్రంలో గాని, తమ పశువైద్యాధికారిని గాని సంప్రదించాలని ఆయన కోరారు.