ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా
అమ్మవారి ఆలయంలో
దసరా ఉత్సవాల ఏర్పాట్లు.
పాతపట్నం అక్టోబర్ 10,మేజర్ న్యూస్:
ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవమైన శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి వైభవంగా ప్రారంభంకానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ చైర్మన్ అక్కంద్ర సన్యాసి రావు ఆధ్వర్యంలో శనివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను ఘనంగా పరిశీలించారు.
ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు మరియు నిర్వాహకులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు. వేకువజామున అలాగే సాయంత్రం వేళల్లో భారీగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, విద్యుత్ దీపాల అలంకరణ వంటి అన్ని వసతులు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు కొనసాగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలో రోజుకో దివ్య అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక టీడీపీ మండల అధ్యక్షుడు పైల బాబ్జి, పట్టణ అధ్యక్షుడు సైలాడ సతీష్, మాజీ జడ్పీటీసీ ప్రతినిధి సీమ రామకృష్ణ, బుజ్జి తదితర ఆలయ సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు.