BREAKING
కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్!

పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం

Select Suryaa Now
పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు  ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం

వాసవి పెనుగొండ, సూర్య న్యూస్:పెనుగొండ పుణ్యక్షేత్రంలోని శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఘన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కట్టా సత్యనారాయణ మూర్తి గుప్త తెలిపారు. పది రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారని పేర్కొన్నారు. ఆచంట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభా హక్కుల కమిటీ చైర్మన్ పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.ఈ నెల 11న శ్రీ బాలా త్రిపురసుందరి దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, మహాలింగార్చన నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు కుమారి పూజ, నీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రోజుకో అలంకారంలో అమ్మవారు

12న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా, 13న శ్రీ లలితా దేవిగా, 14న శ్రీ అన్నపూర్ణాదేవిగా, 15న శ్రీ గాయత్రీ దేవిగా, 16న శ్రీ లక్ష్మీదేవిగా, 17న శ్రీ సరస్వతీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 18న శ్రీ దుర్గాదేవిగా అలంకరించి ఉదయం 9 గంటలకు 102 మంది కన్యలకు పూజలు నిర్వహించనున్నారు. 19న శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా, 20న అమ్మవారి నిజరూపంలో దర్శనమివ్వనున్నారు.

భక్తులకు అన్ని సౌకర్యాలు:అర్చకులు కోట వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, అమ్మవారి అలంకరణలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు.ట్రస్ట్ బోర్డు సభ్యులు వి. రాజేందర్, వెండ్ర బిందు వాసవి, యానాపు సత్తిబాబు, పాతర్లపల్లి సుబ్బలక్ష్మి, కుసుమే మహాలక్ష్మి, కొత్త కోటేశ్వరి, దూడే వెంకటేష్, కందుకూరి పూర్ణిమ, బూది శ్రీనివాస్ తదితరులు ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి గుబ్బల రామ పెద్దింట్లు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కట్టా సత్యనారాయణ మూర్తి గుప్త కోరారు.

 రిపోర్టర్:- వెంకటరామయ్య పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా