BREAKING
నేటి రాశి ఫలాలు – 12 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 12 అక్టోబర్ 2026, సోమవారం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్

మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి!

Select Suryaa Now
మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి!

 

గూగుల్ ఇండియా సైకాలజిస్ట్ పాకలపాటి అమర్ నాథ్

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం

ఎస్.రాయవరం, మేజర్ న్యూస్
శరీరానికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లినట్టే.. మనసుకు బాధ కలిగితే సైకాలజిస్ట్ ను కలవడంలో తప్పు లేదని... గూగుల్ ఇండియా సైకాలజిస్ట్, ప్రముఖులు పాకలపాటి అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ సైకాలజిస్ట్ అమర్ నాథ్ చెప్పిన ముఖ్యంశాలు!

శరీరానికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లినట్టే, మనసుకు బాధ కలిగితే సైకాలజిస్ట్‌ని కలవడంలో తప్పు లేదని ఆయన మరోమారు స్పష్టం చేశారు. మన సమాజంలో శరీర ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యత మానసిక ఆరోగ్యానికి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుతో బాధపడుతున్నా... బయటకు చెప్తే చులకనగా చూస్తారనే భయంతో చాలామంది మౌనంగా నరకం అనుభవిస్తున్నారని తెలిపారు. ఆధునిక జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్లు, సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలామంది లోపలి నుంచి ఒంటరివారైపోతున్నారని, పైన నవ్వుతూ కనిపించే ప్రతి ముఖం వెనుక సంతోషం ఉందనుకోవడం పొరపాటేనని అన్నారు.

సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లడం అంటే...
పిచ్చి ఉన్నట్టు కాదని, అది మన మనసును సరిచేసుకునే సరైన ప్రయాణమని అమర్ పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ద్వారా సమస్యల మూలాలను గుర్తించి జీవితాన్ని ప్రశాంతంగా ఎదుర్కొనే మార్గాలను తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రెండు పనులు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకటి - కుటుంబంలో లేదా స్నేహితుల్లో ఎవరైనా బాధలో ఉంటే.. తీర్పులు ఇవ్వకుండా శ్రద్ధగా వినడం, రెండు - ఒత్తిడిలో ఉన్నప్పుడు దాచుకోకుండా నిపుణుల సహాయం తీసుకోవడం ఈ రెండు పనులూ తప్పకుండా చేయాల్సిందే అన్నారు. మానసిక ఆరోగ్యం లగ్జరీ కాదు, అది 'ప్రాథమిక హక్కు' అని అమర్ నాథ్ స్పష్టంగా పేర్కొన్నారు.