25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష
ఇరగవరం సూర్య న్యూస్ :సమస్యల పరిస్కారం కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఇరవై ఐదో రోజుకు చేరింది. ఈ పోరు బాట 25రోజులు గడుస్తున్న ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ సంఘీభావం తెలపకపోవడం విచారకరమని గ్రామ సహాయకుల సంఘం అధ్యక్షులు కట్టుంగ కోటేశ్వరావు ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి డిమాండ్ల పరిష్కరానికి చర్యలో తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అందరు గ్రామ సేవకులు పాల్గొన్నారు.
దాయం దొరబాబు, రిపోర్టర్, ఇరగవరం పశ్చిమ గోదావరి జిల్లా