ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.
తిరుపతి ,రెవిన్యూ, మేజర్ న్యూస్.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
ఎస్ వి వైద్య కళాశాల, రుయా ఆస్పత్రి, మానసిక విభాగ ఆధ్వర్యంలో అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్, డాక్టర్ జి.రవి ప్రభు, రుయా ఆసుపత్రి ఇంచార్జ్ సూపరిటెండెంట్ డాక్టర్ మధుసూదన్, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.*
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జి రవి ప్రభు మాట్లాడుతూ అందరూ రోగుల్లోనూ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయితే వాళ్లతో సానుభూతితో మాట్లాడటం ద్వారా సమస్యను వినడం ద్వారా యోగ మెడిటేషన్ చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరూ ధ్యానము వ్యాయము క్రమం తప్పకుండా చేయాలని పీజీ వైద్య విద్యార్థులకు యూజీ వైద్య విద్యార్థులకు మరియు మానసిక ఒత్తిడి కలిగిన రోగులకు వివరించారు.
రూయా ఆసుపత్రి, మానసిక విభాగము మరియు
మత్తు వ్యసన నిర్మూలన కేంద్రం కలిసి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన మానసిక రోగులకు, మానసిక ఆందోళనలతో ఉన్నవారికి, కౌన్సిలింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాము అని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా రుయా ఆసుపత్రి ఇంచార్జ్ సూపరిటెండెంట్ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ, యాక్సిడెంట్ అయిన వాళ్లకు ఆపరేషన్ కంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిని కనుక్కొని వారి యొక్క కౌన్సిలింగ్ చేయడం వల్ల ఎంతో మనోధైర్యాన్ని కలిగి ఉంటారని కులంకుశంగా వివరించారు
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా
ఎస్ వి వైద్య కళాశాల నుంచి స్విమ్స్ సర్కులర్ వరకు అవగాహన భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది.
ఇలాంటి అవగాహన ర్యాలీలు నిర్వహించడం వలన మానసిక వ్యాధి, మత్తు వ్యసనాలకు, పాల్పడిన వారు, అవగాహన మరియు కౌన్సిలింగ్ ద్వారా మరలా వారి ఉత్తమైన జీవితాన్ని కొనసాగడానికి ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య నివారణ దినోత్సవ అవగాహన ర్యాలీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
మానసిక విభాగాధిపతి డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ
ఈ సంవత్సరం థీమ్ జీవిత అనుభవాలు ఉన్నవి నిజమైన స్వరాలు నిజమైన మార్పు * 11 సంవత్సరాల నుంచి 28 సంవత్సరంలో ఉన్న కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు మరియు యువతకు ఎక్కువగా మానసిక సమస్యలు వస్తాయని, యువతకు మానసిక సమస్యలు రావటానికి గల కారణాలను ఎలా నివారించుకోవచ్చు వాళ్ళ ప్రణాళికలు ఏ విధంగా చేసుకోవాలి చదువు విషయంలో ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? కెరీర్ ని ఎలా ఎంపిక చేసుకోవాలి ఆందోళన భయము ఆత్మహత్యలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు 22వ నెంబరు మానసిక విభాగం నందు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని తెలిపారు .
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జున రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భారతి డాక్టర్ శారద పీజీ వైద్య విద్యార్థులు, యూజీ వైద్య విద్యార్థులు, మత్తు వ్యసన నిర్మూలన సిబ్బంది , మత్తు పదార్థాల వ్యసనాల కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ గుండ్లపల్లి మురళి, ఎస్ రమణయ్య V ఉష మునస్వామి గీత, తులసి, గోపి, మరియు నర్సింగ్ కళాశాల సిబ్బంది, నర్సింగ్ విద్యార్థినీ విద్యార్థులు మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్ఓ వీర కిరణ్ తదుతరులు పాల్గొన్నారు.
కె రాజేష్, రిపోర్టర్, తిరుపతి