రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు!
ఎస్.రాయవరం, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 ఫుట్‌బాల్ జిల్లా స్థాయి పోటీల్లో ఎస్.రాయవరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. కోటఉరట్ల ప్రభుత్వ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన స్టేట్ సెలక్షన్ పోటీల్లో ఎస్.రాయవరం పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు మహ్మద్ హాలీ మున్నిసా, టి.హారిక రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.విద్యార్థినులకు అభినందనల వెల్లువతమ పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీసం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులను అభినందించారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందం, స్కూల్ మేనేజ్‌మెంట్ చైర్మన్ స్వాతి, వైస్ చైర్మన్ లక్ష్మి విద్యార్థినులకు అభినందనలు తెలియజేశారు.