జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు
తిరుపతి జిల్లా తొలి జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జడ్పీ (సీఈఓ)గా టి.ఎన్. శోభన్ బాబు ను నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం తిరుపతి జిల్లా డిఆర్డిఏ డిఆర్ డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి గా విధులు నిర్వహిస్తున్న అయినకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరుపతి జిల్లా ఏర్పాటు తర్వాత తొలి జడ్పీ సీఈఓ గా ఆయన నియమితులు కావడం విశేషం.సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందిన శోభన్ బాబు నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.