బీజేపీ ఆధ్వర్యంలో ‘రంగోలి రాష్ట్రం’ కార్యక్రమం
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,జంగారెడ్డిగూడెం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ‘రంగోలి రాష్ట్రం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల ముగ్గులతో భారతదేశ పటాన్ని, 2047 నాటికి వికసిత భారత్ సాధించాలనే లక్ష్యాలను ప్రతిబింబించే చిత్రాలను అందంగా తీర్చిదిద్ది తమ సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, సృజనాత్మకత, జాతీయ భావాలను పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో యువత, విద్యార్థుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు సొలస రవికుమార్, పాశం సాయి ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షుడు వేమూరి శ్రీనివాసరావు, పట్టణ ఇన్‌చార్జి మోడేపల్లి నాగు, జిల్లా ఉపాధ్యక్షురాలు పి.వి. రామలక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి సునీల్ దత్ సాహు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొప్పాక శ్రీనివాసరావు, పీసీఎస్ సొసైటీ డైరెక్టర్ కుంచాడ దుర్గాప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నివాస్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు చిటికెన రమేష్, సమయమంతుల సూరిబాబు, జల్లిపల్లి సీతారామయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా