పూల సింగిడి.. బతుకమ్మ సందడి!
చౌటుప్పల్: పట్టణంలోని విశాల భారతి ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆటపాటలు, కోలాట ప్రదర్శనలతో సందడి చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. పూలను గౌరవిస్తూ ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాలను భావితరాలకు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ముత్యం శ్రీనివాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.