కాకతీయ కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఇల్లందు సూర్య ప్రతినిధి :
ఘనంగా బతుకమ్మ సంబరాలు..
ఇల్లందు రూరల్, సూర్య మేజర్ న్యూస్ : బతుకమ్మ వేడుకలను స్కూల్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని కాకతీయ స్కూల్లో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ రామచందర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయాలకు నిలయంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగలో తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయం, సంస్కృతి కి అద్దం పడుతుందన్నారు. రాష్ట్రంలోనే కాక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ వేడుకలను తెలంగాణ ఆడపడుచులు ఘనంగా నిర్వహిస్తూ సంస్కృతి సంప్రదాయాలు చాటడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే వేడుకల్లో తీరక పూలతో పండుగను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. నేడు విద్యార్థులకు బతుకమ్మ పండుగ ఆనవాయితీ సాంప్రదాయాలు చాటి చెప్పే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. సాంప్రదాయ దుస్తులను విద్యార్థులు ధరించి సంబరాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భావితరాలకు మన సంస్కృతి ,సంప్రదాయాలు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయినీలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు సూర్య రూరల్ రిపోర్టర్ డానియల్