BREAKING
బండి సంజయ్ భవానీ దీక్ష కోకో మొక్కల ఎదుగుదలపై అవగాహన సామంతపూడి పాఠశాలలో ముందస్తు దసరా వేడుకలు. ఎమ్మెల్యే అమిలినేని ఘనంగా సత్కరించిన ప్రైవేట్ పాఠశాలల సంఘం. శాస్త్రవేత్తలు జాబితాలో అంతర్జాతీయ ఖ్యాతి న్యూజిలాండ్‌ ఉద్యోగం పేరుతో రూ.7.50 లక్షలు స్వాహా… బీజేపీ ఆధ్వర్యంలో ‘రంగోలి రాష్ట్రం’ కార్యక్రమం ఉషశ్రీ శతజయంతికి సహకరిస్తాం డాక్టర్ జంధ్యాల, ఎం.సి. దాస్ తెలంగాణ ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ మునిసిపల్ ఎన్నికల భద్రతపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజాసేవలో ముందుంటుంది వాసవి క్లబ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధ వెంకట సూర్యప్రకాశరావు పెద్దల పండుగకు హిందూ స్మశాన వాటికలో ప్రత్యేక శుభ్రత 25 మంది సిబ్బందితో మూడు రోజులుగా పారిశుద్ధ్య పనులు అంగన్వాడీ కార్యకర్తలకు బిజెపి మహిళ మోర్చా సన్మానం పూల సింగిడి.. బతుకమ్మ సందడి!

మార్వాడిల దుకాణాల ఎదురుగా కార్మికుల ఆందోళన

Select Suryaa Now
మార్వాడిల దుకాణాల ఎదురుగా కార్మికుల ఆందోళన

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్:

ప్రొద్దుటూరు పట్టణంలో అల్యూమినియం ఐరన్ గ్లాస్ స్టీల్ కార్మికుల జీవనోపాధిపై రాజస్థాన్ దుకాణ యజమానుల ప్రభావం చూపుతుందని వారి నుండి స్థానిక కార్మికుల జీవనోపాధిని కాపాడాలని ప్రొద్దుటూరు అల్యూమినియం ఐరన్ గ్లాస్ స్టీల్ కార్మికుల అసోసియేషన్ సభ్యులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక మైదుకూరు రోడ్డు లోని రాజస్థాన్ దుకాణ యజమానుల కారణంగా తమ జీవనోపాధి ప్రమాదకర పరిస్థితుల్లో ఉండడంతో వారి నుండి కాపాడాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో దుకాణాల ఎదురుగా ఆందోళన వ్యక్తం చేస్తూ గో బ్యాక్ రాజస్థాన్ ఓనర్స్ అంటూ తక్షణమే స్థానిక కార్మికులకు పనిని కల్పించాలని డిమాండ్ చేశారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అల్యూమినియం ఐరన్ స్టీల్ గ్లాస్ కు సంబంధించిన దుకాణ యజమానులు స్థానిక కార్మికులకు పనులు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అల్యూమినియం కార్మికులు పనులు లేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అధికారులు కల్పించుకొని న్యాయం చేయాలని వారు కోరారు. ఎందుకంటే రాజస్థాన్ నుండి వచ్చిన దుకాణ యజమానులు ఇంటికి సంబంధించిన ఇంటీరియల్ పరికరాల విషయంలో మోసం చేస్తూ క్వాలిటీ లో అక్రమాలు చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారని తెలిపారు. వారి మోసానికి గురైన వినియోగదారులు ప్రశ్నించే క్రమంలోనే యజమానులు లేకపోవడం జరుగుతుందన్నారు స్థానికంగా కార్మికులు పనిచేస్తే ఇలాంటి మోసాలు జరగనివ్వకుండా చూస్తారన్నారు ప్రొద్దుటూరు పట్టణంలో మన ఊరు మన వ్యాపారులు అనే నినాదంతో కార్పొరేట్ కంపెనీలను అడ్డుకుంటున్న తరుణంలో అల్యూమినియం గ్లాస్ స్టీల్ ఐరన్ కు సంబంధించిన పనులలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన యజమానులను ఆదరించడం సమంజసం కాదన్నారు స్థానిక వ్యాపారులు వినియోగదారులు అర్థం చేసుకొని స్థానిక కార్మికులకే పనులను అప్పగించేలా చర్యలు తీసుకోవాలని వారి విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్ దుకాణ యజమానులు దుకాణాలు ఎత్తివేసి పనులు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. అలా కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారి చేత పనులు చేసుకోవడం వల్ల స్థానిక కార్మికుల జీవనోపాధి పోతుందని తెలిపారు తక్షణమే రాజస్థాన్ యజమానులు పునరాలోచించి దుకాణాలు ఎత్తివేయాలని లేదంటే పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దస్తగిరి ప్రధాన కార్యదర్శి వలి సభ్యులు సుబ్బరాయుడు హరి షామీర్ హుస్సేన్ వర్షాద్ థామస్ రఫీ మస్తాన్ గౌస్ రసూల్ బాబు మరియు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా