BREAKING
టీటీడీ విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు -రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ -టిటిడి విద్యాసంస్థల నిర్వహణపై ప్రశంసలు గుంటూరు నగరంలో వ్యక్తి అదృశ్యం ఆసియా ర్యాంకింగ్స్ లో వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఇంటెల్ లో మరోసారి ఉద్యోగాల కోత.. ఎవరిపై ప్రభావం పడుతోంది? ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీ అందుతుందా? పూర్తి వివరాలు ఇవే! ఎస్పీడబ్ల్యూలో రక్తదాన శిభిరం పుణెలో గూగుల్ ఇంజనీర్ నెలవారీ ఖర్చు రూ.40,000 లోపే.. ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న పొదుపు మంత్రం! ఉత్తమ పౌరులుగా ఎదగాలి -నూతన విద్యార్థినులకు ఘనంగా ఇండక్షన్ -రెండు రోజుల జీవన నైపుణ్యాల శిక్షణకు శ్రీకారం -ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యం: వీసీ ప్రొఫెసర్ వి.ఉమ 28న పాఠశాల స్థాయి కథల పోటీలు -డిసెంబర్ 6న విశ్వం టాలెంట్ స్కూల్ వేదికగా జిల్లా స్థాయి పోటీలు కథల పోటీలు బ్రోచర్ ఆవిష్కరించిన ప్రముఖులు 500 మిలియన్ డాలర్ల మైక్రోసాఫ్ట్ డీల్‌తో ఓపెన్‌ఏఐ నిషేధాన్ని అధిగమిస్తున్న బైట్‌డ్యాన్స్.. అమెరికా ఆంక్షలకు చెక్ పెడుతున్న చైనా టెక్ దిగ్గజం! ప్రమాణానికి ముందే ప్రజాసేవకు శ్రీకారం 54 డివిజన్ లో వీధి దీపాలు డ్రైనేజీ సమస్యల పరిష్కారం -ప్రజలలో వెలుగులు నింపిన నూతన కార్పొరేటర్ బోయళ్ళ శాంతి అత్యంత కష్టతరమైన ఏడాది తర్వాత స్పైస్‌జెట్‌కు రూ.5,500 కోట్ల సంజీవని.. నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్! ఆసియా టాప్ రిటైల్ వీధుల జాబితాలో మెరిసిన హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు.. కానీ ఢిల్లీ ఖాన్ మార్కెట్ మాత్రం మరో స్థాయిలో! విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున ఖరారు.*  గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం.. టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి

ఓటు హక్కు పరిరక్షణ కోసం శాంతియుత ర్యాలీ 10న టవర్‌ క్లాక్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు UJAC ర్యాలీ CEC రాజీనామా చేయాలని.. బ్యాలెట్‌ పేపర్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌

Select Suryaa Now
ఓటు హక్కు పరిరక్షణ కోసం శాంతియుత ర్యాలీ  10న టవర్‌ క్లాక్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు UJAC ర్యాలీ  CEC రాజీనామా చేయాలని.. బ్యాలెట్‌ పేపర్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌

 

అనంతపురం బ్యూరో : ప్రజాస్వామ్య హక్కులు, ఓటు హక్కు పరిరక్షణ కోసం యునైటెడ్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ  అనంతపురం ఆధ్వర్యంలో ఈ నెల 10న శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు అనంతపురం టవర్‌ క్లాక్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు ర్యాలీ కొనసాగుతుందని వెల్లడించారు.

అనంతపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూజెఏసి కన్వీనర్‌ సి. జాఫర్‌, మాజీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, మైనారిటీ ఎక్స్‌ప్రెస్‌ ఎడిటర్‌ బాబాషా, కాంగ్రెస్‌ నాయకులు నవాజ్‌ ఖాద్రి, చాందిని మసీదు ముతవల్లి రఫీ తదితరులు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, తొలగించబడినట్లు పేర్కొంటున్న ఓట్లను పునరుద్ధరించి సమగ్ర పరిశీలన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఈవీఎంల స్థానంలో బ్యాలెట్‌ పేపర్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు.

ర్యాలీని శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించాలనే ఆసక్తి ఉన్న ప్రజలు, ప్రజాసంఘాలు, యువత, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యూజెఏసి నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మొఘల్‌ సైఫుల్లా బేగ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు జావీద్‌, యూజెఏసీ నాయకులు షఫీ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.