అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో పూర్వ ప్రాధమిక విద్య
కనిగిరి ,మేజర్ న్యూస్ :మండలం లోని జమ్మలమడక అంగన్వాడీ కేంద్రంలో మన అంగన్వాడి- మన బాధ్యత అనే నినాదంతో 9వ జాతీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమం ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం వి ఎస్. పార్వతి అధ్యక్షతన గురువారం నిర్వహించారు.ముందుగా పోషక పదార్థాలతో లోగో ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలు, చిన్నారులలో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐదు ప్రధాన అంశాలైన ఆహార వైవిధ్యం,తగినంత ప్రోటీన్, కేంద్రంలో తాజాగా వేడిగా వండిన భోజనం, వంటల్లో మునగాకు వినియోగం, మెనూ చార్ట్ ప్రదర్శన ,సామూహిక యాజమాన్యం మరియు జవాబుదారితనం , పీఎంఎంవి వై పథకం గురించి అవగాహన కలిగించారు .ఐటిసి ప్రదం కోఆర్డినేటర్ ఎస్ వెంకట్రావు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య, పిల్లల సమగ్ర అభివృద్ధి,పి పి1&2 వర్క్ బుక్స్ ప్రతిరోజు రాయడం వల్ల పిల్లల్లో కలిగే నైపుణ్యాలు గురించి టీవీలు సెల్ సెల్ ఫోన్లకు పిల్లలు దూరంగా ఉంచాలని అవగాహన కలిగించారు.అనంతరం సామాజిక సేవ చేస్తున్న ఎం. కోటేశ్వరుని ఘనంగా సన్మానించారు. జాతీయ పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించి, అనంతరం గ్రామంలో పోషక విలువలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వి. కల్పన ,అంగన్వాడి టీచర్లు, గర్భవతులు, బాలింతలు, కిశోర్ బాలికలు, పిల్లలు పాల్గొన్నారు.