BREAKING
హెచ్ ఆర్ ఏ జె మీడియా సెక్రటరీగా విమన్ కుమార్ నియామకం గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు

కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు

Select Suryaa Now
కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
తొమ్మిదవ జాతీయ పౌష్టికాహార మాసోత్సవాలు ముగింపు సిడిపిఓ సులోచన రాణి ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఇంకొల్లులో రోటరీ గంగ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గత నెల రోజులుగా ప్రతి అంగన్వాడీ సెంటర్ లో మాసోత్సవాలను నిర్వహించారు. పౌష్టికాహారం పై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. డైలీ, ప్రీస్కూల్, యాక్టివిటీస్ కార్యక్రమాలు నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలకు సత్కారం చేసి సి.డి.పి.ఓ అభినందించారు. అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమం నిర్వహించారు. పీఎంఎంబివై, మిషన్ వాత్సల్య, చైల్డ్ మ్యారేజ్ పై అవగాహన కల్పించారు. ఇంటిలో తయారుచేసే ఆహార పదార్థాలు తీసుకోవాలని, ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉండటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా బాలింతగా ఉన్నప్పుడు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కిమ్స్ హాస్పిటల్ వారు తెలియజేశారు.  పాస్ ద పోషన్ బాల్ యాక్టివిటీ ద్వారా కార్యకర్తలకు సమతుల ఆహారం, ఆరోగ్యం, స్కీమ్స్ గురించి ప్రశ్నలు అడిగి విజేతలకు బహుమతులు అందజేశారు. అంగన్వాడీ ఉత్సవం పోషణకార్యక్రమాలు బాగా చేసిన వారికి అంగన్వాడి ఛాంపియన్ పోషణ ఛాంపియన్ గా ప్రకటించి సత్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మాత్యులు శ్రీ గౌరవనీయ శ్రీమతి వంగలపూడి అనిత వీడియో కాల్ ద్వారా పిల్లల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు.  కార్యక్రమంలో రోటరీ గంగ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి,  సూపర్వైజర్స్ వాణి ,వాణిశ్రీ, సుమలత, సునీత, బిందు, ఉష ,ఎం ఎస్ కే ఇందుమతి, బిపిసి సర్వోత్తమ్, ఇంకొల్లు ప్రాజెక్టు కార్యకర్తలు పాల్గొన్నారు.