BREAKING
గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' విద్యుత్ సబ్ స్టేషన్ ముందు టిడిపి ధర్నా బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు

జనసేనలోకి భారీగా చేరికలు

Select Suryaa Now
జనసేనలోకి భారీగా చేరికలు

జనసేనలోకి రోజురోజుకు పెరుగుతున్న వలసలు

నెల్లూరు జిల్లా, కావలి: కావలి రూరల్ జనసేన నాయకుడు సోమయ్య గారి పరుశురాం ఆధ్వర్యంలో, సుకుమార్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీకి చెందిన 35 మందికి పైగా యువత, కొత్త సత్తం వైసీపీ సీనియర్ నాయకులు స్వామి శెట్టి, లక్ష్మీనారాయణ, పలువురు వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ నాయకులు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  ఈ సందర్భంగా కావలి పట్టణంలోని 4వ వార్డుకు చెందిన వైసీపీ నాయకురాలు పాలంకి సరిత, 10వ వార్డుకు చెందిన జాలాది రాజేంద్రగుప్తా, పి. రమాదేవి తదితరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జనసేన సీనియర్ నాయకులు సన్నం వెంకటసుబ్బయ్య గారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సుపరిపాలన, అలాగే జనసేన నాయకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి జనసేనలోకి వైసీపీ నుంచి భారీగా వలసలు పెరుగుతున్నాయని అన్నారు. కావలి వైసీపీ ఇన్‌చార్జ్ ప్రతాప్ కుమార్ రెడ్డి వైఖరి, నాయకత్వం నచ్చకపోవడం వల్లే ఆ పార్టీని వదిలిపెట్టి జనసేనలోకి భారీగా వస్తున్నారని వెంకటసుబ్బయ్య స్పష్టం చేశారు.  రాష్ట్రంలో రోజురోజుకూ కావలి ప్రాంతంలో జనసేన పార్టీ బలోపేతానికి, సుకుమార్ రెడ్డి గారి నాయకత్వానికి అండగా వైసీపీ నుంచి భారీ చేరికలు పెరుగుతున్నాయి.