BREAKING
గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు ఈసారి పండుగ సీజన్‌లో ఆల్కహాల్ విక్రయాలు తగ్గే అవకాశం ఉందన్న దిగ్గజ రిటైలర్ టెస్కో

ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు

Select Suryaa Now
ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు

ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు

భక్తులు దాతలు సమకూర్చిన సొమ్మును ప్రభుత్వ నిధులుగా చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే

దేవాలయాల అభివృద్ధి కోసం భక్తులు దాతలు సమకూర్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ నాయకులకు సరికాదని బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం

కోహెడ : కోహెడ మండల కేంద్రంలో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయాల నిధులకు సంబంధించి ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి రూ.3.80 కోట్లు, పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి రూ.1.50 కోట్లు, హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానానికి రూ.85 లక్షలు మంజూరయ్యాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖమ్మం వేంకటేశం తీవ్రంగా ఖండించారు. ఎండోమెంట్ శాఖ పరిధిలోని ఆయా దేవాలయాల బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇతర నిధులు ఆయా ఆలయాలకు చెందినవేనని ఆయన స్పష్టం చేశారు భక్తులు దాతలు ఎన్నో సంవత్సరాలుగా సమర్పించిన విరాళాలు, కానుకలతో సమకూరిన ఆలయ నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా చూపించడం వాస్తవాలను వక్రీకరించడమేనని అన్నారు. ఆలయాల ఖాతాల్లో ఉన్న నిధులను ఆలయాల అభివృద్ధి పనులకు వినియోగించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడం వేరు ఆ నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా ప్రచారం చేయడం వేరు అని ఆయన పేర్కొన్నారు అనుమతులు ఇవ్వడాన్ని నిధుల మంజూరుగా చిత్రీకరించి రాజకీయ ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య అని విమర్శించారు. ప్రజల భక్తి దాతల సేవాభావంతో ఏర్పడిన ఆలయ నిధులపై రాజకీయ స్వార్థం కోసం క్రెడిట్ తీసుకోవడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు ఆయన సూచించారు. ప్రభుత్వం నిజంగా తన ఖజానా నుంచి నిధులు కేటాయించి ఉంటే వాటి వివరాలు, జీఓలు, బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఆలయాల బ్యాంకు ఖాతాల్లో ఎంత మొత్తంలో నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఎక్కడి నుంచి సమకూరాయి. ప్రభుత్వం ఎంత మొత్తాన్ని తన బడ్జెట్ నుంచి కేటాయించింది. ప్రస్తుతం ఆలయాల నిధుల్లో నుంచి ఎంత మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నారు. అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఖమ్మం వేంకటేశం డిమాండ్ చేశారు. ఆలయాల సొమ్ము ఆలయాలదే భక్తుల విరాళాలు భక్తులవే. వాటిని ప్రభుత్వ నిధులుగా చెప్పుకునే హక్కు ఎవరికీ లేదు. వాస్తవాలను ప్రజల ముందుంచాలి” అని ఆయన స్పష్టం చేశారు.