BREAKING
39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల! రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా ఎంపీ తండ్రి మునికృష్ణయ్యకు పరామర్శ కావలిలో జనసేనలో చేరిన వైసీపీ వాలంటీర్లు, నాయకులు ఎన్నికలలో భాగంగా సిరిసిల్ల బస్ డిపోలో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చోడ వెంకట రెడ్డి ప్రమాద బాధిత కుటుంబానికి మున్నా నగర్ రమేష్ ఆర్థిక సాయం సమాచార హక్కు చట్టంపై అవగాహన నంద్యాలలో నీటి సరఫరాలో అంతరాయం - మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న డిఫరెంట్ థ్రిల్లర్‌గా వస్తున్న మయూఖ.. హాలీవుడ్ స్థాయి అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె! మొండిదిన్నెపాలెంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మానవత్వమే మనిషి నిజమైన చిరునామా రాష్ట్రస్థాయి పోటీలకు సాయి సత్య చిన్మయి ఎంపిక. సింగరేణి లాభాల్లో కార్మికులకు 36% వాటా ఇవ్వాలి - లేకుంటే సింగరేణి భవన్‌, ప్రజాభవన్‌ ముట్టడి: టీజీబీకేఎస్‌ రిలయన్స్ గో బ్యాక్గ్గు గ్యాస్ ఉత్పత్తితో పర్యావరణానికి పంటలకు తీవ్ర నష్టం..* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్..*

లాభాల వాటా తేల్చాల్సిందే - సీఐటీయూ బ్రాంచ్  కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్

Select Suryaa Now
లాభాల వాటా తేల్చాల్సిందే - సీఐటీయూ బ్రాంచ్  కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్
సూర్య నస్పూర్ : సింగరేణి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటాను ఎప్పుడు ప్రకటిస్తారని సింగరేణి కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సీఐటీయూ బ్రాంచ్‌ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్‌ ప్రశ్నించారు. లాభాల వాటాను ప్రకటించి కార్మికుల వాటాను వెంటనే వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్కే న్యూటెక్‌ గని వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఫిట్‌ సెక్రటరీ పెరుక సదానందం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కస్తూరి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, రెండు, మూడు నెలలుగా డ్రిల్‌ బిట్లు, రాడ్లు, నాలుగు, ఐదు నెలలుగా బూట్లు, సాక్సులు ఇవ్వడం లేదన్నారు. వెంటనే వాటిని అందించాలని కోరారు. సర్ఫేస్‌/ఫిట్‌ ఫర్‌ సేమ్‌ జాబ్‌ పొందిన వారికి మరోసారి మెడికల్‌ బోర్డు అవకాశం కల్పించేలా సర్క్యులర్‌ను సవరించాలని, 150 మస్టార్ల క్రమశిక్షణ చర్యల సర్క్యులర్‌ను మార్చాలని డిమాండ్‌ చేశారు. క్లరికల్‌ సిబ్బందికి ఫర్నిచర్‌, కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్మికులకు కొత్త యూనిఫాంలు అందించాలని కోరారు. 12 ఏళ్లుగా భర్తీ చేయని సెక్యూరిటీ సిబ్బంది పోస్టులను యువ కార్మికులు, కార్మికురాళ్లతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. లాభాల వాటాపై ఐఎన్‌టీయూసీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.