రిలయన్స్ గో బ్యాక్గ్గు గ్యాస్ ఉత్పత్తితో పర్యావరణానికి పంటలకు తీవ్ర నష్టం..* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్..*
చింతలపూడి మేజర్ న్యూస్: రిలయన్స్ గో బ్యాక్ అంటూ భూగర్భ బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి ప్రాజెక్టు (యూ.సీ.జీ)కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రేచర్ల లోని గ్రీన్ ఫీల్డ్ హైవే అండర్ పాస్ వద్ద రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. మా భూమి మా హక్కు అంటూ నినాదాలు చేశారు. ముందుగా రేచర్ల బొగ్గు బోర్ వద్ద నిరసన వ్యక్తం చేసి గ్రీన్ ఫీల్డ్ వరకు రైతులు ప్రదర్శన చేశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రిలయన్స్ యూసీజీ ప్రాజెక్టు కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం,అధికారులు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి వలన పర్యావరణం నాశనం అవుతుందని, రైతుల పంటలు పూర్తిగా దెబ్బతింటాయని, భూగర్భ జలాలు,గాలి, భూమి కలుషితం అయ్యి రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రిలయన్స్ కంపెనీకి ప్రజా సంపదను కట్టబెట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, ప్రజల జీవితాలను బొగ్గు పాలు చేయడం అన్యాయమన్నారు.ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి, అరటి మొక్కజొన్న, వరి తదితర పంటలు నాశనం అయితే రైతులు, ప్రజలు ఉపాధి కోల్పోతారని చెప్పారు.యూసీజీ ప్రాజెక్టు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రైతులు, ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆర్.వి.ఎస్. నారాయణ,రైతు సంఘం నాయకులు పి. పాండు రంగారావు, రైతులు కంచర్ల శ్రీనివాసరావు, కొనకళ్ళ రాఘవరావు, పిడపర్తి ముత్తారెడ్డి, చిక్కాల శ్రీనివాసరావు, కొమ్మిన వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాసరావు, కొనకళ్ళ శరత్ కుమార్, బలుసు సతీష్, చిట్లూరి సత్యనారాయణ, గార్లపాటి లక్ష్మణరావు, కొండిబోయిన శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పసుమర్తి గ్రామం జిల్లా ఇన్చార్జి ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా