నంద్యాలలో నీటి సరఫరాలో అంతరాయం - మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
సూర్య, నంద్యాల బ్యూరో: నంద్యాల పట్టణంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు.
నంద్యాల పట్టణ దుర్గా హాస్పిటల్ దగ్గర మంగళవారం బీఎస్ఎన్ఎల్ శాఖ కేబుల్ వర్క్ చేయు క్రమములో నీటి సరఫరా పైప్ లైన్ ను డ్యామేజ్ చేయటం జరిగినదన్నారు. ఇందుకు సంబంధించి వెనువెంటనే మున్సిపల్ సిబ్బంది వారు మరమ్మత్తు పనులు చేపట్టడం జరుగుచున్నదన్నారు. అందువలన ఈ క్రింది ఏరియాలకు అనగా శ్రీనివాస నగర్, సంజీవనగర్ గేట్, చాంద్ బడా, రోజాకుంట పార్ట్, రామనాథ రెడ్డి నగర్, పద్మావతి నగర్, శ్రీదేవి నగర్ ఏరియాలకు నీటి సరఫరా నందు అంతరాయం కలుగుతుందన్నారు. పట్టణ ప్రజలు ఇందుకు సహకరించవలసినదిగా కమిషనర్ కోరారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*