యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం భరోసా
వేంపల్లె మేజర్ న్యూస్:
రాష్ట్రంలోని యువత భవిష్యత్ కి టిడిపి కూటమి ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధ్యార్థులు, నిరుద్యోగ యువత సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యను అభ్యసించే విధ్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రధానంగా ఎంబిఏ, ఎంసీఏ, ఎంటెక్ తదితర పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రస్తుతం టిడిపి కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను ప్రోత్సాహించే దిశగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తోందన్నారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి పరిశ్రమలు, పెట్టుబడులు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.
గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.