రాష్ట్రస్థాయి పోటీలకు చిన్మయి ఎంపిక.
గన్నవరం, మేజర్ న్యూస్.
గన్నవరం గ్రామానికి చెందిన మానికొండ సాయి సత్య చిన్మయి రాష్ట్రస్థాయి అండర్–19 వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైంది. స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్లస్–86 కిలోల విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు డీఎస్‌ఏ కోచ్ స్వామి తెలిపారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో చిన్మయి పాల్గొననుంది. రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయకర్త డి. నాగరాజు, కే. గీత, తాన్యగిరి తదితరులు ఆకాంక్షిస్తూ చిన్మయిని అభినందించారు.ప్రస్తుతం చిన్మయి ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. గతంలో ఫెన్సింగ్, జూడో, తైక్వాండో క్రీడల్లో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్న చిన్మయిని పలువురు అభినందించారు.
గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణా జిల్లా.