అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో క్రేజీ డబ్బింగ్ సినిమా సందడి చేయడానికి సిద్ధమవుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ప్రతిష్టాత్మక చిత్రాన్ని 'సప్తసాగరాలు సప్తగిరులు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. టాలెంటెడ్ నటులు సూరి, నివిన్ పౌలీ మరియు అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎం.సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై ట్రేడ్ వర్గాల్లో మరియు మ్యూజిక్ లవర్స్ నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టింది. ఇటీవల విడుదలైన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్న సూరి మరియు నివిన్ పౌలీ ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. రొమాంటిక్ సైకాలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో తంగ మీన్కల్, తారమణి, పెరంబు వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు రామ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలు అందించారు. ఇప్పటికే చిత్రంలోని పాటలు మరియు నేపథ్య సంగీతం సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ముందుగా సంచారి పేరుతో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు 'సప్తసాగరాలు సప్తగిరులు' అనే ఆకర్షణీయమైన టైటిల్‌తో అక్టోబర్ 9న థియేటర్లలోకి రాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ రొమాంటిక్ సైకాలాజికల్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది.
Also Read: జూబ్లీహిల్స్‌లో అరుదైన ఆభరణాల ప్రదర్శన.. 'ది ట్రెజర్ చెస్ట్'ను ప్రారంభించిన అల్లు స్నేహా రెడ్డి!