బసవతారకం మెడికల్ క్యాంపును సందర్శించిన మా రెడ్డి లతా రెడ్డి
సింహాద్రిపురం మేజర్ న్యూస్ :
మండల కేంద్రంలో నిర్వహించిన బసవతారకం క్యాన్సర్ స్క్రీనింగ్, మెడికల్ క్యాంప్ చివరి రోజు కార్యక్రమాన్ని పులివెందుల మాజీ జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి, పుప్పాల శ్రీధర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంప్‌లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.
క్యాంప్‌లో బసవతారకం మేనేజర్ లక్ష్మణ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సులోచన రాణి, గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవణ కుమారి, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రశాంత్ తదితర వైద్యులు పాల్గొన్నారు.