మున్సిపల్ స్కూల్ కు ఏవిఓపిఎ బీరువా వితరణ
నగర పరిధి ఎన్జీవోస్ కాలనీలోని సప్తగిరి నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో గోద్రెజ్ బీరువాను వితరణ చేశారు. ఈ మేరకు కె.పి.వర్ధనమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కె.మునికృష్ణ శెట్టి, మహిళా విభాగ అధ్యక్షురాలు ఆదర్శలత పాఠశాల అవసరాల నిమిత్తం ఈ బీరువాను ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా విభాగ అధ్యక్షురాలు ఆదర్శ లత మాట్లాడుతూ సమాజం మనకేమిచ్చిందని అనుకోకుండా, సమాజానికి తమ వంతు సహాయం చేయాలని, తమకున్నంతలో ఇతరులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. విద్యాంజలి పోర్టల్ ద్వారా పాఠశాల అవసరాన్ని గుర్తించి, ఆ పాఠశాల ఎస్ఎంసి చైర్ పర్సన్ గిరిజకు బీరువా తాళాలు అందజేశారు మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శైలజ, కోశాధికారి ఉమామహేశ్వరి, సభ్యులు పి.లక్ష్మి, శాలిని, సుధా, జీవన్ కుమార్ శెట్టి, మధుసూదన్ శెట్టి, సుబ్రహ్మణ్యం శెట్టి, రమేష్ శెట్టి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కిరణ్మయి, ఉపాధ్యాయులు ప్రభు కుమార్ శెట్టి, పద్మజ, కళావతి పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి