కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ..తీవ్ర ఉద్రిక్తత
సూర్య, సిద్ధిపేట :నరేంద్ర మోడీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. అదే సమయంలో రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. కాంగ్రెస్ యత్నాన్ని బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.