BREAKING
87 ఏళ్ల వృద్ధురాలి మృతితో గృహ నిర్మాణ సంక్షోభంపై నేతల పరస్పర విమర్శలు హెచ్ ఆర్ ఏ జె మీడియా సెక్రటరీగా విమన్ కుమార్ నియామకం గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు

గోదావరి  పుష్కరాల పనులన్నీ పకడ్బందీగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

Select Suryaa Now
గోదావరి  పుష్కరాల పనులన్నీ పకడ్బందీగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
 - ప్రతి అధికారి తమ పరిధిలోని పనులను నిరంతరం పర్యవేక్షించాలి - గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ ప్రతినిధి: గోదావరి పుష్కరాల సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులన్నింటినీ పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.  గురువారం సాయంత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం ఈవో కార్యాలయంలో పుష్కరాల పనుల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.బాసరలో జరుగుతున్న పనుల వివరాలను శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అధికారి తమ పరిధిలోని పనులను నిరంతరం పర్యవేక్షించాలని, గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కింగ్ వంటి  సౌకర్యాలన్నీ కల్పించాలని ఆదేశించారు. పుష్కరాల నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు ఏవైనా ఉంటే, వెంటనే ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అలాగే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.       
ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, హార్టికల్చర్ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.