ఆధార్ కేంద్రము, ఫార్మేటివ్ పరీక్షలను సందర్శించిన ఎంఈఓ రవీందర్
ఆధార్ కేంద్రము, ఫార్మేటివ్ పరీక్షలను సందర్శించిన ఎంఈఓ రవీందర్
పెనుగంచిప్రోలు మేజర్ న్యూస్ :-
పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈరోజు పాఠశాల విద్యాశాఖ ప్రతి విద్యార్థిని బయోమెట్రిక్ గుర్తింపును మెరుగుపరిచే ప్రత్యేక ఆధార్ కేంద్రాలను నిర్వహిస్తున్నదని పెనుగంచిప్రోలు ఎంఈఓ డి రవీందర్ అన్నారు. ఆయన బాలికల ఉన్నత పాఠశాల లోని ఆధార్ సెంటరును హెచ్ఎం నక్కా బాబురావుతో కలిసి సందర్శించారు. ఆధార్ అప్డేట్ చేసే విధానాన్ని పరిశీలించి సలహాలు సూచనలు ఇచ్చారు. మధ్యాహ్న భోజనం అమలును పర్యవేక్షించి, స్వయంగా తిని సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న హెచ్ఎం బాబురావును అభినందించారు. పాఠశాలలో పరీక్షలను సందర్శించి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ముక్కా సత్యనారాయణ, వేగినేటి వెంకటరమణ, సిఆర్పిలు జొన్నలగడ్డ గోపాల్, సాంబశివరావు, నరేష్, చందు తదితరులు పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు సూర్య ప్రతినిధి ఎం ప్రశాంత్