స్థానిక సంస్థలు ఎన్నికలపై అధికారుల సమీక్ష
పులివెందుల మేజర్ న్యూస్ :
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధివిధానాలు, శాంతిభద్రతల నిర్వహణపై అధికారుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీమతి తనూజ, ఆర్డీవో, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ చిన్నయ్య, డీఎస్పీ మురళీనాయక్, సీఐలు పులివెందుల అర్బన్ సీఐ పురుషోత్తం రాజు, రూరల్ సీఐ శాంతిలాల్, ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన విధులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.