BREAKING
పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు ఈసారి పండుగ సీజన్‌లో ఆల్కహాల్ విక్రయాలు తగ్గే అవకాశం ఉందన్న దిగ్గజ రిటైలర్ టెస్కో బీఆర్‌బీ నాయుడుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుభాకాంక్షలు..!! ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం జనసేనలోకి భారీగా చేరికలు ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు గంటా సమక్షంలో 200 మంది టీడీపీలో చేరిక : వైసీపీకి షాక్... కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం. బాహుబలి కిలికిలి భాషను మించేలా.. రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో మరో కొత్త భాష! అంతర్యుద్ధ శిథిలాల నుంచి సిరియా పర్యాటక రంగ పునరుజ్జీవనం విద్యా వ్యవస్థ ప్రక్షాళన... బలోపేతానికి ప్రాధాన్యత.. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అమీనాపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

పోషణ మాసం, బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు

Select Suryaa Now
పోషణ మాసం, బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు

 

ఇనుగుర్తి, పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఇనుగుర్తి రైతు వేదికలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... బాల్య వివాహాల నివారణ, చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ, అబార్షన్ల నిరోధం, మహిళల సమస్యలు, పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్ల నివారణ, వయోవృద్ధుల సంరక్షణ మరియు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు.పోషణ మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిన ఆవశ్యకతను, శిశువు ఎదుగుదలలో మొదటి 1000 రోజుల పోషణ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మహిళల రక్షణ, సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం మిషన్ శక్తి ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం ఆడపిల్లల పుట్టినరోజు వేడుకలు, సామూహిక సీమంతాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గ్రామీణ బాలల పరిరక్షణ కమిటీ  బోర్డులను పంపిణీ చేశారు. అలాగే గ్రామాల్లో వీసీపీసీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు, ఏసీడీపీవో, డీహెచ్‌ఈడబ్ల్యూ సిబ్బంది, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్, బీఆర్‌బీ కోఆర్డినేటర్, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్, పీవో-ఐసీ, హెల్త్ సూపర్‌వైజర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.