BREAKING
ఈసారి పండుగ సీజన్‌లో ఆల్కహాల్ విక్రయాలు తగ్గే అవకాశం ఉందన్న దిగ్గజ రిటైలర్ టెస్కో బీఆర్‌బీ నాయుడుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుభాకాంక్షలు..!! ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం జనసేనలోకి భారీగా చేరికలు ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు గంటా సమక్షంలో 200 మంది టీడీపీలో చేరిక : వైసీపీకి షాక్... కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం. బాహుబలి కిలికిలి భాషను మించేలా.. రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో మరో కొత్త భాష! అంతర్యుద్ధ శిథిలాల నుంచి సిరియా పర్యాటక రంగ పునరుజ్జీవనం విద్యా వ్యవస్థ ప్రక్షాళన... బలోపేతానికి ప్రాధాన్యత.. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అమీనాపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కెనడా వాణిజ్య విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్న అమెరికా వేల్పూర్ లోఇందిరమ్మ గృహప్రవేశం

మూడు రోజులపాటు .. సేవా సేతు అభియాన్ ” క్యాంపులు....

Select Suryaa Now
మూడు రోజులపాటు .. సేవా సేతు అభియాన్ ” క్యాంపులు....

రూఫ్‌టాప్ సోలార్‌పై ప్రజలకు అవగాహన –  రూ.78 వేల వరకు సబ్సిడీ... అన్ని సబ్ డివిజన్లలో క్యాంపుల నిర్వహణ... విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీరు పి సుధాకర్ వెల్లడి..

నెల్లూరు, వేదాయపాలెం,  మేజర్ న్యూస్  :   ఏపీ.దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 6, 7, 8 తేదీల్లో “ మూడు రోజులపాటు సేవా సేతు అభియాన్” క్యాంపులను నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీరు  పి సుధాకర్ తెలిపారు. స్థానిక విద్యుత్ భవన్ నందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ప్రతి ఇంటికి సౌర విద్యుత్‌ను చేరువ చేయడం,రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే సేవా సేతు అభియాన్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా అర్హత కలిగిన గృహ వినియోగదారులకు
రూ.78 వేల వరకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ
పథకం వర్తిస్తుందన్నారు. అర్హత కలిగిన గృహ వినియోగదారులకు:
1 కిలోవాట్‌కు రూ.30,000
2 కిలోవాట్లకు రూ.60,000
3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000
వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు.
క్యాంపుల్లో పూర్తి సమాచారం… “సేవా సేతు అభియాన్” క్యాంపుల ద్వారా ప్రజలకు పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ పొందే ప్రక్రియ, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు, నెట్ మీటరింగ్ తదితర అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.  ఈ క్యాంపుల్లో బ్యాంకర్లు, సోలార్ విక్రేతలు, డివిజన్ అధికారులు పాల్గొని వినియోగదారుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పథకం అమలుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించనున్నారు.
ప్రతి ఇంటినీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమే లక్ష్యం : అర్హత ఉన్న ప్రతి గృహ వినియోగదారుడు పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తన ఇంటినే విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చుకోవాలని తెలిపారు.  రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడం తోపాటు స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. జిల్లా పరిధిలోని సబ్ డివిజన్, జిల్లా స్థాయిలో సేవా సేతు కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి, పథకం ప్రయోజనాలను అర్హులైన ప్రతి గృహ వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో సేవా సేతు క్యాంపులను సందర్శించి రూఫ్‌టాప్ సోలార్‌పై పూర్తి సమాచారాన్ని తెలుసు కోవాలని.. పథకం ప్రయోజనాలను పొందాలని కోరారు. పీఎం సూర్య ఘర్ పథకం లేదా సేవా సేతు క్యాంపులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఏపీ ఎస్పీడిసియల్ 1912 కాల్ సెంటర్‌ను సంప్రదించి సమాచారం పొందవచ్చని తెలిపారు.