ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ గారి మీడియా సమావేశం
దేశానికి ఆదర్శంగా నిలుస్తోన్న సంజీవని కార్యక్రమంపై గొడ్డలి పార్టీ నేతలు, సాక్షి పత్రిక పగలు, రాత్రి అని తేడా లేకుండా విషం కక్కుతుందని ఏపీ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ మండిపడ్డారు. పేదలకు అందుతున్న కార్పొరేట్ వైద్యాన్ని చూసి తట్టుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ద్వజమెత్తారు. సంజీవని కార్యక్రమంతో ప్రతీ ఇంటికి టెలీ మెడిసిన్ సేవలు, సుమారు 45 రకాల వైద్య పరీక్షలు చేసి వాటిని డిజిటల్ రికార్డు చేస్తున్నట్లు వివరించారు. పక్క నిబంధనలతో పారదర్శకంగానే టెండర్ల పక్రియా జరిపి రూ.415 కోట్లతో టాటా సంస్థకు ఇస్తే వైసీసీ నేతలు దీనిపై విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు.