తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారం కీలకం*
*తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారం కీలకం*
*పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాలు, పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*
*పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన సమాజం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి*
కర్నూలు/అక్టోబర్ 07: తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. గర్భధారణ దశ నుంచే తల్లులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శిశువు జన్మించిన అనంతరం ఆహారం, టీకాలు, శారీరక–మానసిక ఎదుగుదలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
బుదవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన పోషణ మాసం–2026 జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే పాల్గొన్నారు.. ఇందులో భాగంగా చిన్నారులకు అన్నప్రాసన చేసి, మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన. చిల్డ్రన్ గ్రోత్ మానిటరింగ్ , మాతృవందన యోజన, అంగన్వాడి కమిటీ సమాజ భాగస్వామ్యం, మిలెట్స్ తయారీ, గర్భిణి మరియు బాలింత ఆహారం, మునగాకు కార్నర్ సూపర్ ఫుడ్ - సూపర్ హెల్త్, అంగన్వాడి భోజనమంటే తాజా వేడి పోషకమైన భోజనం, పోషణ + ప్రేరణ పిల్లల మంచి అభివృద్ధి, ఆహార వైవిద్యం.. మరింత ప్రోటీన్ ... మెరుగైన పోషణ అంశాల్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గర్భధారణ సమయంలో తీసుకునే పోషకాహారం తల్లి, శిశువు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని తెలిపారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, టేక్‌హోమ్ రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషణ మాసంలో భాగంగా ‘ప్రోటీన్ ప్లేట్’ భావనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, అన్నం, కూరలతో పాటు గుడ్లు, పాలు, పప్పులు, శనగలు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆరు నెలల తర్వాత పిల్లలకు తల్లిపాలతో పాటు వయస్సుకు అనుగుణంగా అదనపు ఆహారం అందించాలన్నారు. ‘మన అంగన్వాడీ–మన బాధ్యత’ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లల హాజరు, మెనూ ప్రకారం నాణ్యమైన వేడి ఆహారం అందుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పిల్లల్లో ఎదుగుదల లోపాలు, ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యులకు రిఫర్ చేయాలని, అంగన్వాడీ, ఆర్‌బీఎస్‌కే బృందాల స్క్రీనింగ్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని అర్హులైన ప్రతి గర్భిణి, బాలింతకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పిల్లల్లో ఎత్తుకు, వయసుకు తగ్గ బరువు లేకపోవడం అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్యకరమైన బాలలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు.
*పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన సమాజం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి*
పోషణ మాసోత్సవాల సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు ప్రభుత్వం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తోందని తెలిపారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, క్యాల్షియం వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలన్నారు. వేరుశనగ, బెల్లం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి అందుబాటులో ఉండే పోషకాహార పదార్థాలను వినియోగించాలని సూచించారు. మిల్లెట్లు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పోషకాహారం తీసుకోవాలని, తల్లి ఆరోగ్యంగా ఉంటేనే శిశువు ఆరోగ్యకరంగా ఎదిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారాన్ని పిల్లలకు అందేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. అంగన్వాడీ కేంద్రాల అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చోట కొత్త కేంద్రాల మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోషకాహారంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడమే పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
అనంతరం జిల్లాలోని 9 ప్రాజెక్టుల పరిధిలో పోషణ్ ఛాంపియన్లుగా ఎంపికైన 9 మంది తల్లులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విజయ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డి.సి. హెచ్. జఫ్రుల్లా, ఎల్.సి.సి చైర్మన్ డాక్టర్ మాధవి శ్యామల, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగిని, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాధిక, బి.సి వెల్ఫేర్ అధికారి ప్రసూన, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్, రాష్ట్ర టి.డి.పి మహిళ కార్యదర్శి పద్మ లత, తదితరులు ప్లాల్గొ