BREAKING
మార్వాడిల దుకాణాల ఎదురుగా కార్మికుల ఆందోళన 87 ఏళ్ల వృద్ధురాలి మృతితో గృహ నిర్మాణ సంక్షోభంపై నేతల పరస్పర విమర్శలు హెచ్ ఆర్ ఏ జె మీడియా సెక్రటరీగా విమన్ కుమార్ నియామకం గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ

సేవా సేతు అభియాన్‌లో పీఎం సూర్య ఘర్‌పై అవగాహన..

Select Suryaa Now
సేవా సేతు అభియాన్‌లో పీఎం సూర్య ఘర్‌పై అవగాహన..

సౌర విద్యుత్‌తో విద్యుత్ బిల్లులకు ఉపశమనం   పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..  డైరెక్టర్ కె. గురవయ్య

నెల్లూరు,  వేదాయపాలెం,  మేజర్ న్యూస్  :   సేవా సేతు అభియాన్‌లో భాగంగా నెల్లూరు సర్కిల్ పరిధిలోని నెల్లూరు టౌన్ డివిజన్, డైకస్ రోడ్ సెక్షన్‌లో విద్యుత్ వినియోగదారులకు పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టెక్నికల్ అండ్ హెచ్ ఆర్ డి) కె. గురవయ్య ముఖ్య అతిథిగా పాల్గొని వినియోగదారులతో నేరుగా మాట్లాడి..పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు.  ఈ సందర్భంగా డైరెక్టర్   కె. గురవయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులు తమ ఇళ్ల పైకప్పులపై రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. వినియోగదారులు పథకానికి సంబంధించిన సబ్సిడీ ప్రయోజనాలు, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు విధానం, దరఖాస్తు ప్రక్రియ, నెట్ మీటరింగ్, విద్యుత్ బిల్లులపై కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ప్రతి గృహ వినియోగదారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు సహకరించాలని సూచించారు.  అలాగే విద్యుత్ వినియోగదారులు తమ సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వినియోగదారులకు అందిస్తూ, సౌర విద్యుత్ వినియోగం వల్ల పర్యావరణ పరిరక్షణకు, విద్యుత్ ఆదాకు మరియు భవిష్యత్‌లో స్థిరమైన విద్యుత్ అవసరాల తీర్చేందుకు కలిగే ప్రయోజనాలను వివరించారు.  సేవా సేతు అభియాన్ ద్వారా విద్యుత్ శాఖ అందిస్తున్న వివిధ సేవలు, వినియోగదారుల సమస్యల పరిష్కారం, విద్యుత్ భద్రత, డిజిటల్ సేవలు మరియు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ విద్యుత్ పథకాలపై ప్రజలకు నేరుగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో నెల్లూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్  పి. సుధాకర్, టెక్నికల్.. టౌన్ డివిజన్ విభాగాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ఇంజనీర్లు.. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు..అసిస్టెంట్ ఇంజనీర్లు.. ఇతర అధికారులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.