BREAKING
మార్వాడిల దుకాణాల ఎదురుగా కార్మికుల ఆందోళన 87 ఏళ్ల వృద్ధురాలి మృతితో గృహ నిర్మాణ సంక్షోభంపై నేతల పరస్పర విమర్శలు హెచ్ ఆర్ ఏ జె మీడియా సెక్రటరీగా విమన్ కుమార్ నియామకం గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ

అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

Select Suryaa Now
అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

ప్రతి చిన్నారి సంరక్షణను బాధ్యతగా భావించాలి

ఐసీడీఎస్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల దిశానిర్దేశం

 ఘనంగా ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :    అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల ఐసీడీఎస్‌ అధికారులకు సూచించారు.  బుధవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  తొలుత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ నాగ శైలజ నెల రోజులుగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో “మన అంగన్‌వాడీ – మన బాధ్యత” పేరుతో నిర్వహించిన పోషణ మాసోత్సవాల కార్యక్రమాల వివరాలను వివరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రతి చిన్నారిపై వ్యక్తిగత శ్రద్ధ చూపాలన్నారు. ప్రతినెలా క్రమం తప్పకుండా చిన్నారుల బరువు, ఎత్తును నమోదు చేస్తూ వారి వయస్సుకు అనుగుణంగా ఎదుగుదల ఉండేలా పర్యవేక్షించాలన్నారు.  బలహీనంగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి తల్లిదండ్రులతో మాట్లాడి అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో వైద్యుల వద్దకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ చిన్నారులకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు కృషి చేయాలని సూచించారు.  ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారులకు సమతుల ఆహారం అందేలా, వారు ఆరోగ్యంగా, పుష్టిగా ఎదిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సూచించారు. చిన్నారుల్లో ఎదుగుదలకు సంబంధించిన సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే వాటికి సకాలంలో పరిష్కారం చూపవచ్చన్నారు. గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు చెందిన చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కల్పించి పిల్లల ఆరోగ్యం, పోషణపై శ్రద్ధ చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలు, పథకాలను అర్హులైన కుటుంబాలకు చేరువ చేయడం అంగన్‌వాడీల ప్రధాన బాధ్యతల్లో ఒకటని కలెక్టర్‌ తెలిపారు. తాము నిర్వహిస్తున్న విధుల పట్ల నిబద్ధత, అంకితభావంతో పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలమన్నారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన అంగన్‌వాడీ కార్యకర్తలను జిల్లా కలెక్టర్‌ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ నాగ శైలజ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుజాత, ఎన్‌జీవో ప్రతినిధి కవితారెడ్డి, ఐసీడీఎస్‌ సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.