BREAKING
రాగంపేట్ సర్పంచ్ ఎలగందుల రాజు ఆధ్వర్యంలో చిన్నారులకు బాలామృతం, పాలు, గుడ్లు పంపిణీ చిత్రాల టైటిల్స్‌లో ఆ పదం ఉంటే చాలు.. సినిమా బ్లాక్‌బస్టరే అంటున్న రవి! ఆధార్ కేంద్రము, ఫార్మేటివ్ పరీక్షలను సందర్శించిన ఎంఈఓ రవీందర్ సేవా సేతు అభియాన్‌లో పీఎం సూర్య ఘర్‌పై అవగాహన.. స్థానిక సంస్థలు ఎన్నికలపై అధికారుల సమీక్ష అటవీ శాఖ అధికారుల దాడితో తీవ్ర ఉద్రిక్తత సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి నిలిపారంటూ ముఖ్యమంత్రి అభినందనలు మూడు రోజులపాటు .. సేవా సేతు అభియాన్ ” క్యాంపులు.... మార్కాపురం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి పోషణ మాసం, బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ గారి మీడియా సమావేశం పేదల పక్షపాతిగా ఎస్ ఆర్ శంకరన్ సేవలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంక‌ట‌పాలెం వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో మంత్రి నారా లోకేష్ పూజ‌లు కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ..తీవ్ర ఉద్రిక్తత

ఇసుక లభ్యతను పెంచేందుకు మరో రెండు కొత్త ఇసుక రీచులకు అనుమతి

Select Suryaa Now
ఇసుక లభ్యతను పెంచేందుకు మరో రెండు కొత్త ఇసుక రీచులకు అనుమతి

ఇసుకను వెలికితీసేందుకు రెండు రీచుల కార్యకలాపాల కాలపరిమితి పొడిగింపు  జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :   జిల్లాలో ఇసుక లభ్యతను మరింత పెంచి, నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు నిరంతరాయంగా ఇసుక సరఫరా చేయడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.  బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్  హిమాన్షు శుక్ల అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక లభ్యత, సరఫరా, కొత్త ఇసుక రీచుల ఏర్పాటుతో పాటు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీచులలో మిగిలి ఉన్న ఇసుకను వెలికితీయడం తదితర అంశాలపై సమీక్షించారు.  ఇసుక లభ్యతను పెంచే చర్యల్లో భాగంగా జిల్లాలో రెండు కొత్త ఓపెన్ సెమీ-మెకనైజ్డ్ ఇసుక రీచ్లకు అనుమతి మంజూరు చేశారు.  అందులో నెల్లూరు రూరల్ మండలంలోని గొల్లకందుకూరు ఇసుక రీచ్‌లో 10.046 హెక్టార్ల విస్తీర్ణంలో 1,50,690 మెట్రిక్ టన్నుల ఇసుక, దేవరపాలెం ఇసుక రీచ్‌లో 4.567 హెక్టార్ల విస్తీర్ణంలో 68,505 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఈ రెండు కొత్త రీచుల ద్వారా మొత్తం 2,19,195 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి రానుంది. అలాగే, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అప్పరావుపాలెం-V, విరువూరు-V సెమీ-మెకనైజ్డ్ ఇసుక రీచులలో మిగిలి ఉన్న ఇసుకను వెలికితీసేందుకు అవసరమైన అనుమతుల పొడిగింపుతో పాటు కార్యకలాపాల కాలపరిమితిని పొడిగించేందుకు కమిటీ అనుమతి మంజూరు చేసింది. అప్పరావుపాలెం-Vలో 98,650 మెట్రిక్ టన్నులు, విరువూరు-Vలో 1,10,413 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 2,09,063 మెట్రిక్ టన్నుల ఇసుక మిగిలి ఉంది. ఈ పరిమాణాన్ని వెలికితీసేలా కార్యకలాపాల కాలపరిమితిని 2027, మే 31వ తేది వరకు లేదా మిగిలిన పరిమాణం పూర్తయ్యే వరకు, ఏది ముందైతే అంతవరకు పొడిగించే చర్యలు తీసుకున్నారు.  చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలోని 7.41 ఎకరాల పట్టా భూమిలో మేట వేసిన ఇసుకను డీ-కాస్టింగ్ చేసి సరఫరా చేసేందుకు అవసరమైన అనుమతులు లభించిన నేపథ్యంలో, ఇసుక అమ్మకం ధరను మెట్రిక్ టన్నుకు రూ.182గా నిర్ణయిస్తూ జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఆమోదం తెలిపింది.  జిల్లాలో ఇసుక లభ్యతను పెంచడంతో పాటు వినియోగదారులకు సులభంగా, నిరంతరాయంగా ఇసుక అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో  జేసి మొగిలి వెంకటేశ్వర్లు, మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస రావు, జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేశి నాయక్, డిటిసి చందర్, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్, డీపీఓ రామన్, పోలీస్, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.