22ఏ కి సంబంధించి 15 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి*
*ఫేజ్–6 గ్రౌండ్ ట్రూథింగ్ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి*
*హౌస్‌సైట్స్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టండి*
*ఈ-ఆఫీస్ ప్రక్రియను శుక్రవారం లోగా పూర్తి చేయాలి*
*జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, అక్టోబర్ 7:- 22ఏ కి సంబంధించి 15 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆర్డీవోలను, తహశీల్దార్లను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో రెవెన్యూ అంశాల పై ఆర్డీఓలతో, తహసిల్దార్ లతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 22ఏకు సంబంధించి 15 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 22-ఏ భూములకు సంబంధించిన పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించి, ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్డీఓలను, తహశీల్దార్లను ఆదేశించారు. 22-ఏ ప్రొసీడింగ్స్ జారీ చేసిన కేసుల్లో మ్యుటేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తయిందా లేదా అనే అంశాన్ని ప్రతి కేసు వారీగా పరిశీలించాలన్నారు.
రీ సర్వే కి సంబంధించి ఫేజ్–4లో తహసీల్దార్ల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.. ఫేజ్–5లో VRO లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. అదే విధంగా ఫేజ్–6కు సంబంధించిన గ్రౌండ్ ట్రూథింగ్ పనులపై దృష్టి సారించి, ఫేజ్–6లో 44 గ్రామాల్లో జరుగుతున్న గ్రౌండ్ ట్రూథింగ్ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు.
హౌస్‌సైట్స్ కి సంబంధించి పలు మండలాల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, పరిష్కరించాలన్నారు. కల్లూరు, ఎమ్మిగనూరు అర్బన్, ఆదోని అర్బన్, కర్నూలు అర్బన్ లలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..జిల్లాలో మొత్తం అర్హులైన హౌస్ సైట్ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, వారిలో ఇప్పటికే ఎన్ని ప్లాట్లు కేటాయించారు, ఎంతమంది నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు, ఎంతమంది నిర్మాణాలు పూర్తి చేశారు అనే వివరాలను స్పష్టంగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్డీఓ లను ఆదేశించారు.. కొత్తగా ఎంతమందికి స్థలాలు కేటాయించాల్సి ఉంది, అందుకోసం ఎంత మేర భూసేకరణ అవసరం అవుతుందనే అంశంపై స్పష్టమైన లెక్కలు సిద్ధం చేయాలన్నారు.
ఈ-ఆఫీస్ ప్రక్రియను పూర్తి చేయాలని గతంలోనే పలుమార్లు చెప్పినప్పటికీ, ప్రక్రియను పూర్తి చేయకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ-ఆఫీస్‌లో సిబ్బందికి మెయిల్ ఐడీ లను క్రియేట్ చేయడం, సిబ్బంది మ్యాపింగ్, డిజిటల్ కీ కోసం దరఖాస్తు తదితర ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే ఎన్‌ఐసీ సిబ్బందితో సమన్వయం చేసుకుని పరిష్కరించుకోవాలని, జిల్లా స్థాయిలో చేయాల్సిన ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ-ఆఫీస్ ప్రక్రియలో డిజిటల్ కీ (డాంగిల్) కోసం వేచి ఉండకుండా, ముందుగా మెయిల్ ఐడీ సృష్టించడం, అవసరమైన మ్యాపింగ్ పూర్తి చేయడం వంటి ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. శుక్రవారం లోగా ఈ-ఆఫీస్‌కు సంబంధించిన పెండింగ్ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలన్నారు.
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ 22-ఏ భూముల కేసుల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుతమైన నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఆర్డీఓలను ఆదేశించారు. ప్రతి 22-ఏ కేసును ఈ-ఆఫీస్‌లో ప్రాసెస్ చేసి, అప్రూవ్ లేదా రిజెక్ట్ చేసే ముందు సంబంధిత పిటిషనర్‌తో తప్పనిసరిగా మాట్లాడాలన్నారు. ప్రస్తుతం వారానికి సగటున 30 నుంచి 50 వరకు 22-ఏ కేసులు పరిష్కరించే అవకాశం ఉన్నందున, రోజుకు పరిష్కరించే ప్రతి కేసులోనూ పిటిషనర్‌తో తప్పనిసరిగా మాట్లాడాలన్నారు. అప్రూవ్ చేసినా, రిజెక్ట్ చేసినా నిర్ణయానికి సంబంధించిన కారణాలను పిటిషనర్‌కు స్పష్టంగా తెలియజేయాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు..
సమావేశంలో డి ఆర్ ఓ సి.వెంకట నారాయణమ్మ, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, సర్వే ఏడి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీత, అనురాధ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియం వద, తహశీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు..