వర్షాభావంలోనూ పీఎండీఎస్‌తో ఆశాజనక ఫలితాలు
( మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)
అనంతపురం కందుకూరు గ్రామంలో రైతు రాజు 16 ఎకరాల వర్షాధార మామిడి తోటలో చేపట్టిన పెల్లెటైజ్డ్ పీఎండీఎస్ క్షేత్రాన్ని పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి టి. విజయ్ కుమార్ పరిశీలించారు. తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ మంచి మొలకలు రావడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఏఎఫ్ పర్యావరణ కేంద్రంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల రైతులతో పంటల పరిస్థితి, పీఎండీఎస్, కాంపాక్ట్ బ్లాకులపై చర్చించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వి. లక్ష్మా నాయక్, పవన్ ముంతా, డాక్టర్ నవీన్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.