BREAKING
ఇసుక లభ్యతను పెంచేందుకు మరో రెండు కొత్త ఇసుక రీచులకు అనుమతి మేఘాలయా సీఎం ప్రశంసలు దక్కించుకున్న ‘బా బా బ్లాక్ షీప్’.. అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్! సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన పోలీసుల అదుపులోకి అనుమానస్పద వ్యక్తులు. 22ఏ కి సంబంధించి 15 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి* పేరలి - తుమ్మలపల్లి నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన ముంబైలో శ్రద్ధా కపూర్, శక్తి కపూర్ లగ్జరీ ఫ్లాట్ లీజు.. నెలకు ఎంత అద్దె వస్తుందో తెలుసా? 2K -రన్ లో పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పల్లెల్లో సి సి రోడ్ల నిర్మాణ పనులకు పనులకు శంకుస్థాపన గొంగటి రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ‘ది ట్రెయిటర్స్’తో ఎక్సైట్‌మెంట్, థ్రిల్‌ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది: తేజ సజ్జ మైసూరులో 'దాదా' షూటింగ్ రీస్టార్ట్.. కోలుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ! నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రేపు సీఐఐ సదస్సులో పాల్గొనున్న సీఎం స్వర్ణ, రజత పతకాలతో సత్తా చాటిన విద్యార్థులు.. అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టిడిపి యువ నాయకులు కసుకుర్తి రాజీవ్ సంగీత్ మృతికి నివాళి

ఉచిత మెగా వైద్య శిబిరం

Select Suryaa Now
ఉచిత మెగా వైద్య శిబిరం

మాలేపాటి రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉచిత మెగా వైద్య శిబిరం
దగదర్తి ,మేజర్ న్యూస్ : మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మరియు దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి రవీంద్ర నాయుడు గారి ఆధ్వర్యంలో దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ యువనేత మాలేపాటి లోకేష్ నేతృత్వంలో ఈరోజు దగదర్తి గ్రామంలోని వెలిపోడు సెంటర్, ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ వద్ద నారాయణ హాస్పిటల్, నెల్లూరు వారి సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న 210 మంది రోగులు వైద్యుల సలహాలు పొందారు. వీరిలో శాస్త్ర చికిత్స అవసరమైన వారిని రేపు నారాయణ హాస్పిటల్ వారి బస్సులో నెల్లూరుకు తీసుకువెళ్లి శస్త్ర చికిత్సలు చేయిస్తామని డాక్టర్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మాలేపాటి లోకేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఈ మెడికల్ క్యాంపు నిర్వహించేందుకు ముఖ్య ఉద్దేశం మా కుటుంబంలో చోటు చేసుకున్న అనర్ధాలేనని, ఇటువంటి మెడికల్ క్యాంపులు ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని, అదే మాకు కొండంత ఆనందాన్నిస్తుందని పేర్కొన్నారు. అనంతరం వైద్యం శిబిరానికి విచ్చేసిన వారందరికీ భోజన సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్స్ డాక్టర్లు ఎన్.నాగ మోహన్, ఎస్.ఈశా, వి.సాయి మంజునాథ్,  PRO దశరథ రామయ్య, ఇతర వైద్య సిబ్బంది మరియు దగదర్తి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.