టిడిపి యువ నాయకులు కసుకుర్తి రాజీవ్ సంగీత్ మృతికి నివాళి
రేపల్లె, మేజర్ న్యూస్: రేపల్లె పట్టణ మాజీ కౌన్సలర్ కసుకుర్తి సంగీత్ రావు కుమారుడు రాజీవ్ సంగీత్ మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చరవాణి ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్య పడవద్దు అండగా ఉండమని భరోసా ఇచ్చారు. మంత్రి సోదరులు అనగానే శివప్రసాద్ రాజీవ్ సంగీత్ మృతి తెలుసుకొని రాత్రి సమయంలో పార్థివ దేహన్ని
సందర్శించి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం బుధవారం పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు పంతాని సాయికుమార్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కొలసాని రాము, క్లస్టర్ ఇంచార్జి దేవగిరి రవి, మాజీ కౌన్సిలర్ షేక్ జమీర్, కైతేపల్లి పిఎసిఎస్ చైర్మన్ వడ్డీ లక్ష్మాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ సంగీత్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.