BREAKING
యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం భరోసా అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన రాష్ట్రస్థాయి పోటీలకు చిన్మయి ఎంపిక. జూబ్లీహిల్స్‌లో అరుదైన ఆభరణాల ప్రదర్శన.. 'ది ట్రెజర్ చెస్ట్'ను ప్రారంభించిన అల్లు స్నేహా రెడ్డి! ఛాతీ తెరవకుండానే చీలిన ప్రధాన రక్తనాళానికి చికిత్స 15 నిమిషాల పాటు శ్వాస ఆపి అందరినీ ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్! అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మృతుడి కుటుంబానికి రూ.1.14 కోట్ల బీమా రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రేపల్లె బ్లడ్ బ్యాంక్ సందర్శన పిట్టలవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ - ఎస్పీ అఖిల్ మహాజన్ లిప్స్ 39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల!

39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి

Select Suryaa Now
39 మద్యం దుకాణాలకు లాటరీ  నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్  ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి

అనంతపురం బ్యూరో : అనంతపురం జిల్లాలో 2026–27 లీజు సంవత్సరానికి నోటిఫై చేసిన మద్యం దుకాణాల్లో 39 దుకాణాలకు డ్రా ఆఫ్ లాట్స్ (లాటరీ) విధానంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి బి. రామమోహనరెడ్డి తెలిపారు.

ఈ డ్రా ఆఫ్ లాట్స్ ప్రక్రియ అక్టోబర్ 8న ఉదయం 8 గంటలకు అనంతపురం జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతపురంలోని జెడ్పీ కాంపౌండ్‌లో ఉన్న జిల్లా ప్రజా సంబంధాల కేంద్రం (డీపీఆర్‌సీ) మీటింగ్‌ హాల్‌లో లాటరీ ప్రక్రియ జరగనుంది.

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 39 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. ఇందులో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 14 దుకాణాలు, తాడిపత్రి మున్సిపాలిటీలో 7 దుకాణాలు ఉన్నాయి.

ప్రాంతాల వారీగా దుకాణాల వివరాలు ఇలా ఉన్నాయి: తాడిపత్రి రూరల్‌లో 2, గుంతకల్లు మున్సిపాలిటీలో 3, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 2, రాయదుర్గం మున్సిపాలిటీలో 1, పామిడి 1, యాడికి 1, కనేకల్ 1, కంబదూరు 1, శెట్టూరు 1, కుందుర్పి 1, సింగనమల 1, బుక్కరాయసముద్రం 1, డి.హీరేహాళ్ 1, బొమ్మనహాళ్ మండలాల్లో 1 చొప్పున దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు.

లాటరీ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత కలిగిన దరఖాస్తుదారులు అక్టోబర్ 8న ఉదయం 7.30 గంటల్లోపు నిర్దేశిత వేదికకు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సూచించారు.

కలెక్టర్ సమక్షంలో జరిగే ఈ డ్రా ఆఫ్ లాట్స్ ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.