మొండిదిన్నెపాలెంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి, మేజర్ న్యూస్ : కావలి రూరల్ మండలం, ఆనెమడుగు పంచాయతీ పరిధిలోని మొండిదిన్నెపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొని ప్రత్యేక అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కి గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మంగళహారతులు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆలయ0 వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి దేవస్థానం వద్ద ఎమ్మెల్యే చేతుల మీదుగా టెంకాయ కొట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడూతూ.. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ కావలి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇటువంటి జాతర్లు, ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆనెమడుగు పంచాయతీ ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు..