BREAKING
యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం భరోసా అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన రాష్ట్రస్థాయి పోటీలకు చిన్మయి ఎంపిక. జూబ్లీహిల్స్‌లో అరుదైన ఆభరణాల ప్రదర్శన.. 'ది ట్రెజర్ చెస్ట్'ను ప్రారంభించిన అల్లు స్నేహా రెడ్డి! ఛాతీ తెరవకుండానే చీలిన ప్రధాన రక్తనాళానికి చికిత్స 15 నిమిషాల పాటు శ్వాస ఆపి అందరినీ ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్! అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మృతుడి కుటుంబానికి రూ.1.14 కోట్ల బీమా రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రేపల్లె బ్లడ్ బ్యాంక్ సందర్శన పిట్టలవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ - ఎస్పీ అఖిల్ మహాజన్ లిప్స్ 39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల!

రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా

Select Suryaa Now
రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా

సూర్య, నంద్యాల బ్యూరో: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)లో రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులు పునరావృతం కాకుండా, క్షేత్రస్థాయిలోనే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, సబ్‌ కలెక్టర్‌ మనీషా, డీఆర్వో రామునాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ ప్రియాంక, డోన్‌, ఆత్మకూరు, బనగానపల్లె ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన ప్రతి దరఖాస్తును బాధ్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా జాప్యానికి తావులేకుండా స్పష్టమైన, శాశ్వత పరిష్కారం చూపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 22ఏ, డాటెడ్‌ ల్యాండ్స్‌, ఇనాం పట్టాలు, మ్యుటేషన్లు, సర్వే సర్టిఫికెట్లు తదితర అంశాల్లో దరఖాస్తుదారులకు సకాలంలో పరిష్కారం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యలను కేవలం పైస్థాయి కార్యాలయాలకు ఫైళ్లు పంపించడంతో పరిష్కరించినట్లు భావించరాదని, ప్రతి దరఖాస్తును లోతుగా పరిశీలించి, తమ పరిధిలో పరిష్కరించగల అంశాలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. తుది నిర్ణయం ఉన్నతాధికారుల పరిధిలో ఉన్న సందర్భాల్లో సంబంధిత ఫైళ్లను ఎలాంటి జాప్యం లేకుండా పైస్థాయికి పంపాలని ఆదేశించారు. సర్వే పూర్తయిన అనంతరం సర్వే సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం లేకుండా తహసీల్దార్లు, మండల సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మండల సర్వేయర్లు సమర్పించిన సర్వే నివేదికలను తహసీల్దార్లు పరిశీలించి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. ప్రజలు ఒకే సమస్య కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
పీజీఆర్ఎస్‌లో వచ్చిన దరఖాస్తులపై సంబంధిత తహసీల్దార్లు, మండల సర్వేయర్లు దరఖాస్తుదారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కార స్థితిని తెలుసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. పరిష్కరించిన కేసులపై కూడా ప్రజల సంతృప్తిని నిర్ధారించే విధంగా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని సూచించారు. జూపాడు బంగ్లా, పాములపాడు, మిడ్తూరు తదితర మండలాల్లో రెవెన్యూ సంబంధిత దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ తెలిపారు. జూపాడు బంగ్లాలో వచ్చిన అధిక సంఖ్యలో దరఖాస్తులను మండలాల వారీగా సమీక్షించి, ప్రతి దరఖాస్తుకు సంబంధించి స్పష్టమైన స్థితిగతులను నమోదు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా, నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని, ఎలాంటి అనవసర ప్రభావాలకు లోనుకాకుండా ప్రజలకు న్యాయబద్ధమైన సేవలు అందించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా అధికారులు పూర్తిగా తటస్థంగా వ్యవహరించాలని సూచించారు. 
*22ఏ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి*

..22ఏకు సంబంధించిన పెండింగ్‌ దరఖాస్తులను తహసీల్దార్లు, ఆర్డీఓలు సమన్వయంతో సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్‌ఎల్‌ఏ గడువు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా, సాధ్యమైనంత త్వరగా పరిశీలన పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.

*ఇనాం పట్టా దరఖాస్తులపై సమీక్ష*

...ప్రతి మండలంలోని ఇనాం పట్టా దరఖాస్తుల సంఖ్య, వాటి ప్రస్తుత స్థితిపై తహసీల్దార్లు, వీఆర్వోల నుంచి స్పష్టమైన నివేదికలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఇనాం పట్టా, 22ఏ వంటి సాధారణంగా పరిష్కరించగల అంశాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.*

*క్యాస్ట్‌ సర్టిఫికెట్లు, నో డ్యూస్‌ సర్టిఫికెట్ల జారీపై స్పష్టమైన ఆదేశాలు*

..స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అవసరమైన క్యాస్ట్‌ సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం సత్వరమే జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికే శాశ్వత ధ్రువీకరణ పత్రం ఉన్న వారికి సంబంధిత వివరాల ఆధారంగా ప్రక్రియను సులభతరం చేయాలని, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను వెంటనే పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు. నో డ్యూస్‌ సర్టిఫికెట్లకు సంబంధించి అవసరమైన పన్ను వివరాలు ఆన్‌లైన్‌లో ప్రతిబింబించేలా వీఆర్వోలు, తహసీల్దార్లు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

*పెండింగ్‌ ఫైళ్లపై ప్రతిరోజూ పర్యవేక్షణ*
...పెండింగ్‌ దరఖాస్తులపై అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రతి ఫైల్‌ ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉందో గుర్తించి వెంటనే తదుపరి స్థాయికి పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన రెవెన్యూ సేవలు అందించడం అధికారుల ప్రాథమిక బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ మాట్లాడుతూ, తహసీల్దార్లకు కేటాయించిన రెవెన్యూ అంశాల పురోగతిని సమీక్షిస్తూ, పెండింగ్‌ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూ సమస్యలు, సర్వే, మ్యుటేషన్‌, 22ఏ, ఇనాం పట్టాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్‌ సర్టిఫికెట్లు తదితర అంశాల్లో నిబంధనల ప్రకారం పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించి, పీజీఆర్ఎస్‌ దరఖాస్తులు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రెవెన్యూ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*