BREAKING
అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన రాష్ట్రస్థాయి పోటీలకు చిన్మయి ఎంపిక. జూబ్లీహిల్స్‌లో అరుదైన ఆభరణాల ప్రదర్శన.. 'ది ట్రెజర్ చెస్ట్'ను ప్రారంభించిన అల్లు స్నేహా రెడ్డి! ఛాతీ తెరవకుండానే చీలిన ప్రధాన రక్తనాళానికి చికిత్స 15 నిమిషాల పాటు శ్వాస ఆపి అందరినీ ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్! అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మృతుడి కుటుంబానికి రూ.1.14 కోట్ల బీమా రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రేపల్లె బ్లడ్ బ్యాంక్ సందర్శన పిట్టలవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ - ఎస్పీ అఖిల్ మహాజన్ లిప్స్ 39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల! రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా

డిఫరెంట్ థ్రిల్లర్‌గా వస్తున్న మయూఖ.. హాలీవుడ్ స్థాయి అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె!

Select Suryaa Now
డిఫరెంట్ థ్రిల్లర్‌గా వస్తున్న మయూఖ.. హాలీవుడ్ స్థాయి అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రం మయూఖ ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ తేజ్ ఎస్.కె దర్శకత్వంలో ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పలు ఆసక్తికరమైన చిత్రాలు నిర్మించిన శ్రీకాంత్ కాండ్రేగుల, తన స్క్రీన్ నేమ్‌ను శ్రీతేజ్ ఎస్.కె.గా మార్చుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు చిత్ర విశేషాలను, మేకింగ్ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

ఈ చిత్రానికి ఇటీవల న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ మిస్టరీ మూవీగా అవార్డు దక్కడం తమ టీమ్‌కు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని దర్శకుడు శ్రీ తేజ్ తెలిపారు. థ్రిల్లర్ కేటగిరీలో సెకండ్ బెస్ట్ అవార్డు వచ్చిందని, కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు కూడా ఈ సినిమాను అప్లై చేసినట్లు ఆయన వెల్లడించారు. కొరియన్ మరియు హాలీవుడ్ సినిమాల తరహా స్టోరీ టెల్లింగ్, కలర్ గ్రేడింగ్ ఈ చిత్రంలో కనిపిస్తాయని, కథ క్రమంగా రివీల్ అవుతూ సెకండాఫ్ వచ్చేసరికి పీక్స్ వెళ్తుందని చెప్పారు. ఓటీటీల కారణంగా థ్రిల్లర్ జోనర్ సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆస్వాదిస్తున్నారని, వారికి నచ్చేలా క్వాలిటీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు.

హీరోయిన్ పాయల్ చెంగప్ప నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ఆమె పాత్ర చుట్టూ తిరిగే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని దర్శకుడు తెలిపారు. స్మశానంలో దెయ్యాలు ఉండే భయం కంటే, మనం నివసించే నిత్య జీవిత ప్రదేశంలోనే ఒక అపరిచిత వ్యక్తి ఉంటే కలిగే భయం చాలా ఎక్కువగా ఉంటుందని, అదే ఈ సినిమా ప్రధానాంశం అని వివరించారు. హీరోయిన్ ఉండే ఫ్లాట్‌లోకి ఆ అపరిచిత వ్యక్తి ఎందుకు వచ్చాడు, వారి మధ్య సంబంధం ఏంటి అనే ఆసక్తికరమైన అంశాలతో కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పారు. శిబి మాత్యూ అలెక్స్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చిందని తెలిపారు.

దర్శకత్వంపై తనకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని, సినిమా మేకింగ్ పట్ల పూర్తి అవగాహన పెంచుకున్న తర్వాతే ఈ ప్రయోగాత్మక సినిమాను రూపొందించానని శ్రీ తేజ్ వెల్లడించారు. నిర్మాత శశిధర్ నల్ల నుంచి పూర్తి సహకారం లభించిందని, విజువల్స్ మరియు ఆడియో పరంగా ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని క్వాలిటీగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. మయూఖ అంటే ఆశాకిరణం అని, సినిమా పూర్తియ్యాక టైటిల్ ఎందుకు పెట్టారో ప్రేక్షకులకు అర్ధమవుతుందని తెలిపారు. భవిష్యత్తులో క్లీన్ యు సర్టిఫికెట్‌తో ఒక ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నానని ఆయన పేర్కొన్నారు.